మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్‌న్యూస్‌, ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్స్‌

Maruti Suzuki Jimny coming onJune 2023 price announcement - Sakshi

వచ్చే నెలలోనే లాంచింగ్‌

న్యూఢిల్లీ: వచ్చే నెలలో మార్కెట్లోకి రానున్న జిమ్నీ మోడల్‌ చేరిక సంస్థ అమ్మకాలు గణనీయంగా పెరిగేందుకు దోహదం చేస్తుందని మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) వెల్లడించింది. అంతేగాక వేగంగా అభివృద్ధి చెందుతున్న స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్స్‌ (ఎస్‌యూవీ) విభాగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి స్థానాన్ని లక్ష్యంగా చేసుకున్న కంపెనీకి ఇది బలమైన మోడల్‌గా నిలుస్తుందని ఆశిస్తోంది. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో నిలిచేందుకు బ్రెజ్జా, ఫ్రాంక్స్, గ్రాండ్‌ విటారా వంటి ఇతర మోడళ్లతో పాటు జిమ్నీ కీలక పాత్ర పోషించాలని సంస్థ భావిస్తోంది. ప్యాసింజర్‌ కార్ల రంగంలో భారత్‌లో ఎస్‌యూవీల వాటా ప్రస్తుతం 45 శాతం ఉంది. ఎస్‌యూవీల్లో కాంపాక్ట్‌ ఎస్‌యూవీలు సగానికిపైగా వాటాను కైవసం చేసుకున్నాయి. 2022–23లో దేశంలో 39 లక్షల యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. ఇందులో కాంపాక్ట్‌ ఎస్‌యూవీలు 8.7 లక్షల యూనిట్లు ఉన్నాయి. లైఫ్‌స్టైల్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ కొత్తగా ప్రాచుర్యంలోకి వస్తోంది. (మంటల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700: వీడియో వైరల్‌, స్పందించిన కంపెనీ)

కంపెనీ వృద్ధిలో సాయం.. 
సంస్థ మొత్తం బ్రాండ్‌ విలువపై జిమ్నీ సానుకూల ప్రభావం చూపుతుందని మారుతీ సుజుకీ ఇండియా సేల్స్, మార్కెటింగ్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. ‘ఒక నిష్ణాత ఎస్‌యూవీగా వారసత్వాన్ని జిమ్నీ కలిగి ఉంది. ఈ విభాగంలో కంపెనీ వృద్ధికి ఇది ఖచ్చితంగా సహాయం చేస్తుంది’ అని అన్నారు. అయిదు డోర్లు కలిగిన జిమ్నీ ఎస్‌యూవీ అభివృద్ధి కోసం ఎంఎస్‌ఐ రూ.960 కోట్లు వెచ్చించింది. ప్రపంచవ్యాప్తంగా 199 దేశాలు, ప్రాంతాల్లో సుజుకీ ఇప్పటి వరకు 32 లక్షల యూనిట్ల జిమ్నీ వాహనాలను విక్రయించింది. విదేశాల్లో ఇది మూడు డోర్లతో లభిస్తోంది. తొలిసారిగా అయిదు డోర్లతో భారత్‌లో రంగప్రవేశం చేస్తోంది. ఆల్‌-టెరైన్‌ కాంపాక్ట్‌ లైఫ్‌స్టైల్‌ ఎస్‌యూవీగా స్థానం సంపాదించింది. ఈ ఫోర్‌-వీల్‌-డ్రైవ్‌ ఆఫ్‌-రోడర్‌ కఠినమైన భూభాగాల్లో కూడా పరుగెత్తగలదు.   (e-Sprinto Amery: మార్కెట్‌లోకి మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఒక్కసారి చార్జి చేస్తే 140 కిలోమీటర్లు..)

జిమ్నీకి 30 వేల బుకింగ్స్‌.. 
ఇప్పటికే జిమ్నీ కోసం సుమారు 30,000 బుకింగ్స్‌ నమోదయ్యాయని శ్రీవాస్తవ వెల్లడించారు. వచ్చే నెల నుంచి డెలివరీలు ఉంటాయన్నారు. ఏటా దాదాపు 48,000 యూనిట్ల విక్రయాలు నమోదయ్యే లైఫ్‌స్టైల్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ రాబోయే కొద్ది సంవత్సరాల్లో త్వరగా విస్తరిస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. జిమ్నీతో అమ్మకాలు తక్కువ సమయంలో రెట్టింపు అవుతాయని శ్రీవాస్తవ చెప్పారు. బ్రెజ్జా, గ్రాండ్‌ విటారా, ఫ్రాంక్స్, జిమ్నీలతో కంపెనీ 2022–23లో దేశీయ ఎస్‌యూవీ విభాగంలో 25 శాతం మార్కెట్‌ వాటాను ఆశిస్తోంది. ఎస్‌యూవీ సెగ్మెంట్లో కంపెనీ వాటా 2022 ఏప్రిల్‌లో 12 శాతం ఉంటే.. గత నెలలో ఇది 19 శాతానికి ఎగసిందన్నారు.    (నైజిరియన్‌ చెఫ్‌ రికార్డ్‌: ఏకంగా 100 గంటలు వంట, ఎందుకో తెలుసా?)

సాయుధ దళాలకు.. 
జిప్సీ మాదిరిగా సాయుధ దళాలకు జిమ్నీ వాహనాలను అందించాలని అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు శ్రీవాస్తవ స్పందిస్తూ.. ఈ మోడల్‌ను పరిచయం చేసిన తర్వాత ఏదైనా నిర్దిష్ట అవసరం ఉంటే కచ్చితంగా పరిశీలిస్తాం. గతంలో సాయుధ దళాలకు 6–10 వేల యూనిట్ల జిప్సీ వాహనాలను సరఫరా చేసేవాళ్లం. ప్రస్తుతం జిప్సీ తయారీని నిలిపివేశాం అని తెలిపారు. 

 మరిన్ని బిజినెస్‌ వార్తలు, ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్స్‌ కోసం చదవండి: సాక్షి బిజినెస్‌ 

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top