నైజిరియన్‌ చెఫ్‌ రికార్డ్‌: ఏకంగా 100 గంటలు వంట, ఎందుకో తెలుసా?

For 100 Hours Straight To Win A Guinness World Record - Sakshi

నైజీరియా దేశానికి చెందిన ఒక చెఫ్ చేపట్టిన కుక్-ఏ-థాన్ విశేషంగా నిలుస్తోంది. లాంగెస్ట్‌ కుక్‌ఏథాన్‌లో హిల్డా బాసీ వరుసగా 100 గంటలు వంట చేసి రికార్డ్‌ బద్దలు కొట్టింది. మే 11-15 వరకు ఏకథాటిగా కుక్‌ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డుల  కెక్కింది. 

దీని  ప్రధాన ఉద్దేశ్యం తమ నైజీరియన్ వంటకాల గురించి ప్రచారం చేయడమేనని ఆమె వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకాల్లో నైజీరియన్ వంటకాలు కూడా  ఒకటని, వీటి గురించిన విశేషాలు మరింతమందికి చేరాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. 

హిల్డా బాసిగా ప్రసిద్ధి చెందిన హిల్డా ఎఫియాంగ్ బస్సే ఈ 100 గంటల్లో 100 కంటే ఎక్కువ మీల్స్‌ ,  దాదాపు 55 ఇతర వంటకాలను ప్రిపేర్‌ చేసింది. ఈ కుక్-ఎ-థాన్ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.  ఈ వీడియో లక్షల లైక్స్‌ను సొంతం  చేసుకుంది. 

హిల్డా బాసికంటే ముందు సుదీర్ఘమైన వంట చేసిన రికార్డు భారతీయ చెఫ్‌ లతా టొండన్ పేరుతో ఉంది. దాదాపు 88 గంటల పాటు వంట చేసి రికార్డు సృష్టించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top