మహీంద్రా XUV700 కొత్త వేరియంట్‌.. ప్రత్యేకతలివే.. | Mahindra XUV700 AX5 Select Variants Launched; Check Here Price And Features | Sakshi
Sakshi News home page

మహీంద్రా XUV700 కొత్త వేరియంట్‌.. ప్రత్యేకతలివే..

May 23 2024 9:19 AM | Updated on May 23 2024 10:03 AM

Mahindra XUV700 new 7 seater variant check price features

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్‌ సంస్థ మహీంద్రా XUV700లో కొత్త AX5 సెలెక్ట్ (AX5 S) వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 16.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). స్కైరూఫ్, డ్యూయల్ 26.03cm హెచ్‌డీ సూపర్‌స్క్రీన్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, రూమి 7-సీటర్ కాన్ఫిగరేషన్‌ వంటి ఆకట్టుకునే ఫీచర్ల లైనప్‌ను AX5 సెలెక్ట్ వేరియంట్ అందిస్తుంది.

సాధారణంగా హై-ఎండ్ మోడల్‌లతో ఇలాంటి ఫీచర్‌లు ఉంటాయి.  ఈ ఫీచర్లు బడ్జెట్‌ ధరలో హై-ఎండ్‌ ఫీచర్‌ల కోసం చూస్తున్న కస్టమర్‌లకు AX5 మంచి ఎంపికగా నిలుపుతున్నాయి. 2022లో విడుదలైన మహీంద్రా XUV700 దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నేపాల్, న్యూజిలాండ్ వంటి అంతర్జాతీయ మార్కెట్‌లలో మంచి ఆదరణ పొంది గ్లోబల్ ఎస్‌యూవీగా మారింది.

మహీంద్రా ఇటీవలే MX వేరియంట్‌లో 7-సీటర్‌ను విడుదల చేసింది. బ్లేజ్ రెడ్ కలర్, డ్యూయల్-టోన్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ ఎలిమెంట్స్, రెడ్ యాక్సెంట్‌లతో ఆల్-బ్లాక్ ఇంటీరియర్‌తో లిమిటెడ్‌ బ్లేజ్ ఎడిషన్‌ను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. కస్టమర్లకు వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. వేరియంట్‌ను బట్టి నాలుగు నుంచి ఎనిమిది వారాలలోపు కస్టమర్లకు డెలివరీ ఇచ్చేలా చర్యలు చేపట్టింది.

Advertisement
 
Advertisement
Advertisement