డైట్ కోక్ ధరకు రెక్కలు.. క్యాన్‌కు రూ.70 వసూలు | Diet Coke Price Hike Aluminium Can Crunch Pushes Prices to Record Rs 70 | Sakshi
Sakshi News home page

డైట్ కోక్ ధరకు రెక్కలు.. క్యాన్‌కు రూ.70 వసూలు

Oct 10 2026 10:07 AM | Updated on Oct 10 2026 10:07 AM

Diet Coke Price Hike Aluminium Can Crunch Pushes Prices to Record Rs 70

ప్రముఖ కూల్ డ్రింక్స్ సంస్థ కోకా-కోలాకు చెందిన ప్రసిద్ధ షుగర్-ఫ్రీ పానీయం డైట్ కోక్ ప్రియం కానుంది. దేశంలో అల్యూమినియం క్యాన్ల కొరత, తయారీ వ్యయం భారీగా పెరగడంతో రిటైలర్లు డైట్ కోక్ ధరలను ఒక్కసారిగా పెంచేశారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, గోవా వంటి ప్రధాన నగరాల్లో 330 మి.లీ డైట్ కోక్ క్యాన్ ధరను రికార్డు స్థాయిలో రూ.50 నుంచి రూ.70కి పెంచినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కోకా-కోలా సొంత ప్లాంట్లలో తయారయ్యే క్యాన్లపై ఇప్పటికీ రూ.50 ఎంఆర్‌పీ మాత్రమే ముద్రించి ఉన్నప్పటికీ మార్కెట్లో కొన్నిచోట్ల మాత్రం రూ.70కి విక్రయిస్తుండటం గమనార్హం.

పెరిగిన ఖర్చులు.. రెట్టింపైన డిమాండ్

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో మార్కెట్లో అల్యూమినియం లభ్యత తగ్గిపోయింది. దాంతో క్యాన్-గ్రేడ్ అల్యూమినియం ధరలు ఏడాది వ్యవధిలోనే 30 శాతం వరకు పెరిగాయి. ఈ భారాన్ని భరించలేక బాటిళ్ల తయారీ కంపెనీలు, స్థానిక వ్యాపారులు ధరలు పెంచక తప్పడం లేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, గడిచిన ఏడాది కాలంలో జీరో-కాలరీ పానీయాలకు డిమాండ్ రెట్టింపు కావడం కూడా ఈ ధరల పెంపునకు కారణంగా కనిపిస్తోంది.

ఈ అంశంపై కోకా-కోలా సంస్థ ప్రతినిధి స్పందిస్తూ ‘భారతీయ నిబంధనలకు కట్టుబడి ప్యాక్‌పై ముద్రించిన ఎంఆర్‌పీ ధరకే విక్రయించాలని ట్రేడ్ భాగస్వాములందరికీ సూచిస్తున్నాం. స్వతంత్ర బాట్లర్లు, రిటైలర్లు తీసుకునే ధరల నిర్ణయాలపై కంపెనీకి నేరుగా నియంత్రణ ఉండదు’ అని వివరణ ఇచ్చారు.

ఇదీ చదవండి: భారత్‌కు ‘స్టార్‌లింక్’ నిజంగా సంజీవనియా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement