మహీంద్రా నుంచి ‘జీతో స్ట్రాంగ్‌’ వాహనం.. ధర ఎంతంటే? | Mahindra Launches New Jeeto Strong With Enhanced Payload Capacity | Sakshi
Sakshi News home page

మహీంద్రా నుంచి ‘జీతో స్ట్రాంగ్‌’ వాహనం.. ధర ఎంతంటే?

Nov 4 2023 7:26 AM | Updated on Nov 4 2023 9:35 AM

Mahindra Launches New Jeeto Strong - Sakshi

బెంగళూరు: మహీంద్రా లాస్ట్‌ మైల్‌ మొబిలిటీ (ఎంఎల్‌ఎంఎంఎల్‌) కొత్తగా సరకు రవాణా కోసం ’జీతో స్ట్రాంగ్‌’ వాహనాన్ని ప్రవేశపెట్టింది. జీతో ప్లస్‌ వాహనానికి కొనసాగింపుగా మరింత ఎక్కువ పేలోడ్‌ సామర్థ్యం, మరిన్ని ఫీచర్లతో దీన్ని రూపొందించినట్లు సంస్థ ఎండీ సుమన్‌ మిశ్రా తెలిపారు.

వెర్షన్‌ను బట్టి (డీజిల్, సీఎన్‌జీ) దీని ధర రూ. 5.28 లక్షల నుంచి రూ. 5.55 లక్షల వరకు (పుణె ఎక్స్‌–షోరూం) ఉంటుంది. డీజిల్‌ వెర్షన్‌లో పేలోడ్‌ సామర్థ్యం 815 కేజీలుగాను, లీటరుకు 32 కి.మీ. మైలేజీ ఉంటుంది. సీఎన్‌జీ వెర్షన్‌ పేలోడ్‌ సామర్థ్యం 750 కేజీలుగా, మైలేజీ 35 కి.మీ.గా ఉంటుంది. మూడేళ్లు లేదా 72,000 కి.మీ. వారంటీ, అలా గే డ్రైవరుకు ఉచితంగా రూ. 10 లక్షల ప్రమాద బీమా కవరేజీ ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement