బుకింగ్స్‌లో కనీవినీ ఎరుగని రికార్డ్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే? | Mahindra BE 6 XEV 9e Bookings And Anand Mahindra Tweet | Sakshi
Sakshi News home page

బుకింగ్స్‌లో కనీవినీ ఎరుగని రికార్డ్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?

Feb 15 2025 8:37 PM | Updated on Feb 16 2025 11:36 AM

Mahindra BE 6 XEV 9e Bookings And Anand Mahindra Tweet

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తన 'బీఈ 6', 'ఎక్స్ఈవీ 9ఈ' ఎలక్ట్రిక్ కార్ల కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన తరువాత  30,179 బుకింగ్‌లను స్వీకరించింది. ఈ విషయాన్ని ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (Twitter) ఖాతాలో వెల్లడించారు.

ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో.. మహీంద్రా కార్లు సరికొత్త రికార్డును సృష్టించాయి. మొదటి రోజు 30,179 బుకింగ్‌లు సాధించాయి. ఇంకో రెండు బుకింగ్స్ కావలి అని ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) పేర్కొంటూ.. ధన్యవాదాలు తెలిపారు. ఈ బుకింగ్ విలువ ఏకంగా రూ. 8472 కోట్లు (ఎక్స్ షోరూమ్).

శుక్రవారం ప్రారంభమైన మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల బుకింగ్లలో XEV 9e 56 శాతం బుకింగ్స్ సాధించింది. BE 6 44 శాతం బుకింగ్స్ పొందింది. ఎక్కువమంది 79 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన ప్యాక్ త్రీ టాప్ మోడల్స్ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మహీంద్రా BE 6 ఐదు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 18.90 లక్షల నుంచి రూ. 26.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మహీంద్రా XEV 9e నాలుగు వేరియంట్లలో ఉంటుంది. దీని ధర రూ. 21.90 లక్షల నుంచి రూ. 30.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement