
ఇష్యూ పరిమాణం రూ.3,600 కోట్లకు కుదింపు
ముంబై: జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌నకు చెందిన జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ పబ్లిక్ ఇష్యూ ఆగస్టు 7న ప్రారంభమై 9న ముగిస్తుంది. తొలుత ఇష్యూ సైజ్ రూ.4,000 కోట్లు ఉండగా.., దాన్ని రూ.3,600 కోట్లకు కుదించినట్లు ముసాయిదా పత్రాల్లో వెల్లడైంది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ ఆగస్టు 6న ఉంటుంది. ఇష్యూలో భాగంగా రూ.1,600 కోట్ల విలువైన తాజా ఈక్విటీలు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.2,000 కోట్లు విలువైన షేర్లను విక్రయించనుంది.
సమీకరించిన నిధుల్లో రూ.800 కోట్లతో రాజస్థాన్ నాగూర్‌లో ఇంటిగ్రిటెడ్ సిమెంట్ యూనిట్ నిర్మాణానికి, రూ.520 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ ఆర్థిక సంవత్సరం 2025లో రూ.163.77 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. నిర్వహణ ద్వారా ఆదాయం రూ.6,028 కోట్ల నుంచి రూ.5,813 కోట్లను దిగివచ్చింది. మొత్తం రుణాలు రూ. 6,166 కోట్లు ఉన్నాయి.
ఐపీఓకు ఏఆర్‌సీఐఎల్
అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ(ఇండియా) లిమిటెడ్ (ఏఆర్‌సీఐఎల్), ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు అనుమతి కోరుతూ సెబీకి ముసాయిదా పత్రాలు సమరి్పంచింది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) కింద ఉంటుంది. కావున కంపెనీకీ నిధులేవీ రావు. సంస్థ ప్రమోటార్లు, ఇతర షేర్ హోల్డర్లు ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా కంపెనీ 10.54 కోట్ల ఈక్విటీలను ఇష్యూ ద్వారా విక్రయించనున్నారు.
ప్రమోటర్ సంస్థలు అవెన్యూ ఇండియా రిసర్జెన్స్ పీటీఈ లిమిటెడ్ 6.87 కోట్ల ఈక్విటీలు, ఎస్‌బీఐ 1.94 కోట్ల షేర్లు, ఫెడరల్ బ్యాంక్ 10.35 లక్షలు షేర్లను విక్రయించనున్నాయి. సింగపూర్‌కు చెందిన లాథే ఇన్వెస్ట్‌మెంట్ పీటీఈ లిమిటెడ్ తన మొత్తం 1.62 కోట్లు(5% వాటాకు సమానం) ఈక్విటీలను విక్రయించనుంది. ఇష్యూకు ఐఐఎఫ్‌ఎల్ క్యాపిటల్ సరీ్వసెస్, ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్, జేఎం ఫైనాన్స్‌లు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా, ఎంయూఎఫ్‌జీ ఇన్‌టైం ఇండియాలు రిజి్రస్టార్‌గా పనిచేయనున్నాయి.