భారత ఫార్మా సంస్థలు ఉత్పత్తులను కాపీ కొట్టవు  | Indian pharma firms not copying products | Sakshi
Sakshi News home page

భారత ఫార్మా సంస్థలు ఉత్పత్తులను కాపీ కొట్టవు 

Jun 13 2025 6:27 AM | Updated on Jun 13 2025 8:02 AM

Indian pharma firms not copying products

మేధో హక్కులను భారత్‌ గౌరవిస్తుంది 

కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ 

బెర్న్‌: భారత ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీలు స్విప్‌ కంపెనీల ఉత్పత్తులను కాపీ కొడతాయన్న ఆరోపణలను కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ ఖండించారు. ఇది ఎంతో కాలంగా నెలకొన్న అపోహ అని స్పష్టం చేశారు. మేధో సంపత్తి హక్కులను (ఐపీఆర్‌) భారత్‌ గౌరవిస్తుందే కానీ.. ఇతరుల నుంచి టెక్నాలజీని ఎప్పుడూ చోరీ చేయదన్నారు. తమ ట్రేడ్‌మార్క్‌లు లేదా పేటెంటెడ్‌ లేదా కాపీ రైట్‌ టెక్నాలజీని భారత కంపెనీలు చట్టవిరుద్ధంగా కాపీ చేశాయన్న దానికి స్విప్‌ కంపెనీలు ఒక్క నిదర్శనం కూడా చూపించలేకపోయినట్టు చెప్పారు. ఈ విషయంలో ఒక్క కంపెనీ కూడా ఏ ఒక్క ఘటనను తమ దృష్టికి తీసుకురాలేదన్నారు. 

పేటెంట్లలో స్వల్ప మార్పులను భారత్‌ అనుమతించబోదన్నారు. దురదృష్టవశాత్తూ కొన్ని కంపెనీలు కొన్ని సవరణలతో అదనపు మేథో హక్కును సొంపాదిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత పేటెంట్‌ చట్టంలోని సెక్షన్‌ 3(డీ) కింద అప్పటికే ఉన్న పెటెంటెడ్‌ ఔషధాల కంటే మరింత ప్రభావవంతమైనవని నిరూపితమైనే కొత్త వాటికి అనుమతులకు అవకాశం కల్పిస్తుండడం గమనార్హం. ఈ నిబంధనలను సవరించాలని కొన్ని బహుళజాతి కంపెనీలు లోగడ కోరినప్పటికీ భారత్‌ తోసిపుచి్చంది. ఐపీఆర్‌ ప్రక్రియలను భారత్‌ మరింత మెరుగుపరుస్తోందని, దీంతో నిబంధనల అమలు భారం తగ్గి, వేగంగా అనుమతులు లభిస్తాయని మంత్రి చెప్పారు.   

Advertisement
 
Advertisement
Advertisement