
ఉదయం 9:30 గంటలకు ఆఫీసుకు రాకపోతే.. ఆ రోజు హాఫ్ డే సెలవుగా పరిగణిస్తామని చెప్పిన కంపెనీ ఉదంతం మరువకముందే.. మరో విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రెడ్డిట్ వినియోగదారుడు షేర్ చేసిన పోస్టులో.. నేను కంపెనీ నిర్వహించిన పరీక్షలో 27/33 స్కోర్ చేశాను. అంటే దాదాపు 82 శాతం స్కోర్ అన్నమాట. కానీ యాజమాన్యం మాత్రం 90 శాతం కంటే తక్కువ స్కోర్ వచ్చినవారు.. మొత్తం పరీక్ష పేపరును 50 సార్లు చేతితో రాయమని పనిష్మెంట్ ఇచ్చిందని చెప్పాడు. దీనికి సంబంధించి తన వచ్చిన మెయిల్ స్క్రీన్‌షాట్ షేర్ చేసాడు.

ఫోటో షేర్ చేస్తూ.. ఇలాంటి కంపెనీని నా జీవితంలో చూడలేదని అన్నాడు. 50 సార్లు రాయడం కూడా ఆఫీస్ వర్క్ ముగించుకున్న తరువాత రాయాలని సూచించారని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు.
ఇదీ చదవండి: జీతం వచ్చిన ఐదు నిమిషాలకే ఉద్యోగి రాజీనామా
ఇది చాలా కామెడీగా ఉందని ఒకరు, మీ కంపెనీ సీఈఓ ఇంతకు ముందు ఉపాధ్యాయుడా? అని మరొకరు, ఇది చాలా అమానుషం అని ఇంకొకరు కామెంట్స్ చేశారు. భారతీయ కార్యాలయాల్లో ఏమి జరుగుతోంది? అని ఇంకొకరు అన్నారు.