తయారీని బలోపేతం చేసేందుకు కమిటీ: నీతి ఆయోగ్‌ సీఈవో | India Sets up Inter Ministerial Committee to Frame National Manufacturing Mission | Sakshi
Sakshi News home page

తయారీని బలోపేతం చేసేందుకు కమిటీ: నీతి ఆయోగ్‌ సీఈవో

Apr 29 2025 6:21 PM | Updated on Apr 29 2025 6:38 PM

India Sets up Inter Ministerial Committee to Frame National Manufacturing Mission

న్యూఢిల్లీ: ప్రతిపాదిత జాతీయ తయారీ కార్యక్రమం రూపురేఖలను ఖరారు చేయడానికి వీలుగా ప్రభుత్వం ఓ అంతర్‌ మంత్రిత్వ కమిటీని నియమించింది. నీతి ఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రమణ్యం చైర్మన్‌గా ఏర్పాటైన ఈ కమిటీ భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు నిర్వహించనున్నట్టు ఓ అధికారి తెలిపారు.

భారత్‌లో తయారీని మరింత ప్రోత్సహించేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం లోగడే ప్రకటించడం గమనార్హం. దీన్ని ఇప్పుడు ఆచరణలోకి తీసుకొచ్చింది. వ్యాపార నిర్వహణ వ్యయాలు తగ్గించడం, భవిష్యత్‌కు అనుగుణమైన ఉద్యోగులను సిద్ధం చేయడం, ఎంఎస్‌ఎంఈని బలోపేతం చేయడం, టెక్నాలజీ లభ్యత, నాణ్యమైన ఉత్పత్తులు.. అనే ఐదు అంశాలపై ఈ కమిటీని కీలక సిఫారసులు చేయనుంది.

Advertisement
 
Advertisement
Advertisement