
హెచ్‌పీ ఇండియా ఎండీ ఈప్సితా దాస్‌గుప్తా
న్యూఢిల్లీ: భారత్‌లో పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) వినియోగం కేవలం 20 శాతంగా ఉన్న నేపథ్యంలో విక్రయాల వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని హెచ్‌పీ ఎండీ (ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక) ఈప్సితా దాస్‌గుప్తా తెలిపారు. ఇళ్లల్లో, కార్యాలయాల్లో పీసీలను మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు పరిశ్రమ వినూత్న వ్యూహాలను అన్వేíÙంచాలని పేర్కొన్నారు.
విద్య, నైపుణ్యల అభివృద్ధి, ఉద్యోగాల విషయంలో పీసీలు కీలక పాత్ర పోషిస్తాయని ఈప్సితా వివరించారు. దేశీయంగా తమ ఉత్పత్తుల విక్రయానికి సంబంధించి కమర్షియల్ విభాగం పటిష్టంగా ఉందని, కన్జూమర్ విభాగం కాస్త నెమ్మదించి, మళ్లీ పుంజుకుంటోందని ఆమె చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోకి కార్యకలాపాలు విస్తరించడం, చిన్న–మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) ప్రాధాన్యతనివ్వడం వంటి అంశాలపై దృష్టి పెడుతున్నట్లు ఈప్సితా తెలిపారు.