India Corporates: Sector Trends 2024: ఆర్థిక వృద్ధితో కార్పొరేట్లకు అవకాశాలు | Sakshi
Sakshi News home page

India Corporates: Sector Trends 2024: ఆర్థిక వృద్ధితో కార్పొరేట్లకు అవకాశాలు

Published Mon, Dec 25 2023 4:53 AM

India Corporates: Sector Trends 2024: India resilient economic growth to boost demand of corporates - Sakshi

కోల్‌కతా: భారత బలమైన ఆర్ధిక వృద్ధి కార్పొరేట్‌ కంపెనీలకు డిమాండ్‌ను పెంచుతుందని ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ పేర్కొంది. ‘ఇండియా కార్పొరేట్స్‌: సెక్టార్‌ ట్రెండ్స్‌ 2024’ పేరుతో నివేదికను విడుదల చేసింది. పెరుగుతున్న డిమాండ్, అదే సమయంలో ముడి సరుకుల ధరల ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టడం అన్నవి వచ్చే ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ల మార్జిన్లను పెంచుతాయని తెలిపింది.

స్థానికంగా బలమైన డిమాండ్‌ నేపథ్యంలో 2024–25లో జీడీపీ 6.5 శాతం వృద్ధి రేటుతో భారత్‌ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్ధిక వ్యవస్థగా ఉంటుందని పేర్కొంది. అంతర్జాతీయంగా సవాళ్లతో కూడిన వాతావరణం, ఇటీవలి ద్రవ్య పరపతి కఠినతర విధానాలున్నప్పటికీ, భారత ఆర్ధిక వ్యవస్థ బలమైన పనితీరు కొనసాగుతుందని అంచనా వేసింది. సిమెంట్, ఎలక్ట్రిసిటీ, పెట్రోలియం ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉంటుందని పేర్కొంది. మౌలిక సదుపాయాల మెరుగుదల సైతం స్టీల్‌ డిమాండ్‌కు ఊతంగా నిలుస్తుందని తెలిపింది. యూఎస్, యూరోజోన్‌లో వృద్ధి తగ్గిపోవడంతో భారత ఐటీ కంపెనీలు మోస్తరు వృద్ధికి పరిమితం కావాల్సి వస్తుందని పేర్కొంది. వాహన విక్రయాలు కంపెనీల ఆదాయాలను పెంచుతాయని తెలిపింది.

Advertisement
Advertisement