
ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు (ఏఐఐబీ) నుంచి రూ.858 కోట్ల (100 మిలియన్లు) రుణాన్ని పొందినట్లు ఐఐఎఫ్‌ఎల్ హోమ్ ఫైనాన్స్ సంస్థ శనివారం తెలిపింది. ‘‘దేశవ్యాప్తంగా పేద కుటుంబాలకు సొంతింటి ఏర్పాటు అవకాశాలు మెరుగుపరిచే లక్ష్య సాధనలో ఏబీబీ నుంచి నిధులు అందడం ఒక కీలక ఘట్టం’’ అని ఐఐఎఫ్‌ఎల్ హెచ్‌ఎఫ్‌ఎల్ సీఈవో మోను రాత్రా తెలిపారు.
ఐఐఎఫ్‌ఎల్ హెచ్‌ఎఫ్‌ఎల్ భాగస్వామ్యం ద్వారా భారత గృహ నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల భవనాలు (గ్రీన్ బిల్డింగ్) ప్రమాణాలు మరింత మెరుగుతాయని ఏఐఐబీ డైరెక్టర్ జనరల్ గ్రెగొరీ లియు తెలిపారు. ఏఐఐబీ నుంచి పొందిన నిధులు దేశ అఫర్డబుల్ హౌసింగ్ వ్యవస్థలో డిమాండ్‌తోపాటు సరఫరా సామర్థ్యాలను మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయని ఐఐఎఫ్‌ఎల్ హోమ్ ఫైనాన్స్ భావిస్తోంది.
డిమాండ్‌కు ప్రతిస్పందనగా ఐఐఎఫ్‌ఎల్ హోమ్ ఫైనాన్స్ ప్రధానంగా పట్టణ ప్రాంతాలలోని ఆర్థికంగా వెనుకబడిన, అల్పాదాయ వర్గాలు తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు గృహ రుణ వితరణను మరింత పెంచనుంది. ఇక సప్లయిపరంగా అందుబాటు ధరల్లో గృహాలు అభివృద్ధి చేసే హౌసింగ్ డెవలపర్లకు ఫైనాన్స్ సాయం అందించనుంది.