
ప్రవాస భారతీయులు విదేశాల నుంచి భారత్‌కు సులభంగా డబ్బులు పంపుకునేందుకు వీలుగా ‘రెమిట్ ఫస్ట్ టు ఇండియా’ ప్లాట్‌ఫామ్‌ను ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ప్రవేశపెట్టింది. ఎలాంటి ఖర్చు లేకుండా, ట్రాన్స్‌ఫర్ ఫీజు లేకుండా డబ్బులు పంపుకోవచ్చని ప్రకటించింది.
సింగపూర్‌కు చెందిన ప్రముఖ రిమిటెన్స్ సేవల సంస్థ సింగ్ ఎక్స్ భాగస్వామ్యంతో ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడం గమనార్హం. ప్రస్తుతం సింగపూర్, హాంకాంగ్ నుంచి డబ్బులు పంపుకునే (రెమిటెన్స్) సేవలు అందుబాటులో ఉండగా, త్వరలో మరిన్ని దేశాలకు విస్తరించనున్నట్టు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ తెలిపింది.