
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఉద్యోగి అరెస్టు
జైపూర్: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగి ఒకరు రూ.232 కోట్లు స్వాహా చేశారు. జైపూర్ విమానాశ్రయంలో ఫైనాన్స్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్న రాహుల్ విజయ్.. గతంలో డెహ్రడూన్ విమానాశ్రయంలో సీనియర్ మేనేజర్‌గా పనిచేశాడు. 2019–20, 2022–23 మధ్య కాలంలో అధికారిక, ఎలక్ట్రానిక్ రికార్డులను తారుమారు చేస్తూ పథకం ప్రకారం మోసానికి పాల్పడ్డాడు. నకిలీ, కల్పిత ఆస్తులను సృష్టించి, వాటి విలువలను పెంచి, కొన్నిసార్లు ఎంట్రీలకు సున్నాలను జోడించి రికార్డులను తారుమారు చేశాడు.
ఆ రికార్డుల నుంచి దాదాపు రూ.232 కోట్ల ప్రజా నిధులను తన వ్యక్తిగత ఖాతాలకు మళ్లించాడు. ఆ తర్వాత నిందితుడు ఆ డబ్బును ట్రేడింగ్ ఖాతాల్లోకి బదిలీ చేశాడు. ఈ మోసాన్ని గుర్తించి సీబీఐకి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచి్చంది. సీబీఐ అధికారులు ఆగస్టు 28న, జైపూర్‌లోని విజయ్ అధికారిక, నివాస ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడిలో స్థిరాస్తులు, విలువైన సెక్యూరిటీలకు సంబంధించిన పత్రాలు స్వా«దీనం చేసుకున్నారు. ప్రజా నిధుల దురి్వనియోగం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.