
యువతకు దీర్ఘకాలంలో సంపద సృష్టికి దోహదపడేలా ఐసీఐసీఐ ప్రూ స్మార్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్లస్ పేరిట మార్కెట్ ఆధారిత యులిప్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్. దీన్ని నెలవారీగా రూ. 1,000 ప్రీమియంకే కొనుగోలు చేయొచ్చని సంస్థ తెలిపింది.
ఇటు లైఫ్ కవరేజీతో పాటు అటు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు కూడా ఇది ఉపయోగపడుతుందని కంపెనీ చీఫ్ ప్రోడక్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ పల్టా తెలిపారు. వీలైనంత ముందుగా ఇన్వెస్ట్‌మెంట్ మొదలుపెట్టి దీర్ఘకాలం కొనసాగించేలా యువతకు యులిప్ ప్లాన్‌లు ఉపయుక్తంగా ఉంటాయన్నారు.
బజాజ్ అలియాంజ్ లైఫ్ కొత్త ఫండ్
జీవిత బీమా సంస్థ బజాజ్ అలియాంజ్ లైఫ్ తాజాగా నిఫ్టీ 500 మల్టీఫ్యాక్టర్ 50 ఇండెక్స్ ఫండ్ పేరిట న్యూ ఫండ్ ఆఫర్‌ను (ఎన్‌ఎఫ్‌వో) ప్రకటించింది. దీన్ని తమ యులిప్ పాలసీల కింద అందిస్తుంది. ఇది నిఫ్టీ 500 మల్టీఫ్యాక్టర్ MQVLV 50 ఇండెక్స్‌ను ట్రాక్ చేసే విధంగా ఉంటుంది. పాలసీదారులకు ఇటు లైఫ్ కవరేజీతో పాటు అటు మల్టీఫ్యాక్టర్ ఆధారిత ఈక్విటీ ఇండెక్స్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఎన్‌ఎఫ్‌వో జూలై 14తో ముగుస్తుంది.