అవరోధాలెన్నో చూసాను: పెద్ద మహిళగా కనిపించడానికి.. | I Am Emotional Person Says Radhika Gupta in Shark Tank India | Sakshi
Sakshi News home page

అవరోధాలెన్నో చూసాను: పెద్ద మహిళగా కనిపించడానికి..

Dec 29 2024 10:36 AM | Updated on Dec 29 2024 11:04 AM

I Am Emotional Person Says Radhika Gupta in Shark Tank India

షార్క్ ట్యాంక్ ఇండియా కార్యక్రమంలో.. ఎడెల్‌వీస్ మ్యూచువల్ ఫండ్స్ సీఈఓ 'రాధికా గుప్తా' (Radhika Gupta) తాను ఉద్యోగం సాధించడంలో ఎదుర్కొన్న కష్టాలను, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చాలా విషయాలను వెల్లడించారు.

పైకి కనిపించేంత కఠినంగా ఉండను, నేను చాలా సెన్సిటివ్ పర్సన్‌ని. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. నేను ఎప్పుడూ చదువులో ముందుండేదాన్ని. నా తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి, తల్లి టీచర్. కాబట్టి నేను చిన్నప్పటి నుంచి బాగా చదివేదాన్ని అని రాధికా గుప్తా పేర్కొన్నారు.

నాకు ఎలాంటి కార్పొరేట్ బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. కాబట్టి చదువులో ముందున్నప్పటికీ.. ఏం చేయాలి? ఎలా చేయాలి అనే విషయాల్లో స్పష్టత ఉండేది కాదు. ఉద్యోగం విషయంలో చాలా తిరస్కరణలను ఎదుర్కొన్నాను. క్యాంపస్‌లో ఉన్నప్పుడే అనేక ఓటములు చూశాను. లుక్స్ పరంగా ఎన్నో అవరోధాలను అధిగమించి.. జాబ్ తెచ్చుకున్నాను. కానీ ఫైనాన్స్ రంగం వైపు వస్తానని ఎప్పుడూ ఊహించలేదు.

ఫైనాన్స్ రంగం (Finance Sector)లోకి అడుగు పెట్టిన తరువాత 33 సంవత్సరాల వయసులోనే సీఈఓ (CEO) అయ్యాను. కానీ పెట్టుబడులు పెట్టేవారు నా వయసును చూసి వెనుకడుగు వేసేవారు. పెద్ద మహిళగా కనిపించడానికి చీర కట్టుకోవడం అలవాటు చేసుకున్న. ఆ తరువాత ప్రజలకు నా మీద నమ్మకం పెరిగిందని రాధికా గుప్తా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement