Hyundai Exter: ఎక్స్‌టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. బుకింగ్ ప్రైస్ & డెలివరీ వివరాలు

Hyundai exter launch date booking price delivery and details - Sakshi

Hyundai Exter: భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ కొత్త కారుని (ఎక్స్‌టర్) విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ SUV ఫోటోలను, డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ వివరాలను వెల్లడించినప్పటికీ ఖచ్చితమైన లాంచ్ డేట్ వెల్లడించలేదు. అయితే ఇప్పుడు సంస్థ ఎక్స్‌టర్ లాంచ్ డేట్ కూడా అధికారికంగా వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

లాంచ్ డేట్
నివేదికల ప్రకారం, హ్యుందాయ్ ఎక్స్‌టర్ 2023 జులై 10న అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే ఈ ఎస్‌యువి మార్కెట్లో అడుగుపెట్టడాని మరెన్నో రోజులు లేదని స్పష్టమవుతోంది. ఇప్పటికే రూ. 11,000లతో బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. కావున డెలివరీలు జులై చివరినాటికి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

వేరియంట్స్ & డిజైన్
మార్కెట్లో విడుదలకానున్న హ్యుందాయ్ ఎక్స్‌టర్ మొత్తం ఐదు వేరియంట్లలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అవి EX, S, SX, SX(O), SX(O) కనెక్ట్. డిజైన్ పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే ఉత్తమంగా ఉండే ఈ కారు ఫీచర్స్ పరంగా కూడా చాలా ఆధునికంగా ఉంటుంది. ఇది హెచ్ షేప్ ఎల్ఈడీ డిఆర్ఎల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, సి పిల్లర్‌కు టెక్స్‌చర్డ్ ఫినిషింగ్, ఫ్లోటింగ్ రూఫ్ ఎఫెక్ట్‌తో డ్యూయల్ టోన్ పెయింట్ ఆప్షన్‌లు లభిస్తాయి. వెనుక వైపు నిలువుగా ఉండే టెయిల్ గేట్, షార్క్ ఫిన్ యాంటెన్నా, బిల్ట్-ఇన్ స్పాయిలర్, టెయిల్-ల్యాంప్‌ వంటివి ఉన్నాయి.

ఫీచర్స్
ప్రస్తుతానికి కంపెనీ ఈ ఎస్‌యువి ఇంటీరియర్ ఫీచర్స్ అధికారికంగా వెల్లడించనప్పటికీ.. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, డ్రైవర్ డిస్ప్లే, ఏసీ వెంట్స్, సింగిల్ పేన్ సన్‌రూఫ్‌ వంటివి వుంటాయని తెలుస్తోంది. మొత్తం మీద ఈ కారు దాని మునుపటి మోడల్స్ కంటే ఉత్తమంగా ఉంటుందని స్పష్టంగా అర్థమవుతోంది.

ఇంజిన్
కొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇది హ్యుందాయ్ ఆరా వంటి కార్లలో ఉపయోగంలో ఉంది. ఈ ఇంజిన్ 83 hp పవర్, 114 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌ పొందనుంది. ఈ మైక్రో ఎస్‌యువి CNG రూపంలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ వెర్షన్ కేవలం  స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది.

(ఇదీ చదవండి: వెయ్యికోట్ల సామ్రాజ్యానికి తిరుగులేని అధినేత్రి - సక్సెస్ స్టోరీ)

సేఫ్టీ ఫీచర్స్
ప్రస్తుతం మార్కెట్లో కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారు కేవలం డిజైన్, ఫీచర్స్, మైలేజ్ వంటి విషయాలతో పాటు సేఫ్టీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మార్కెట్లో విడుదలైన తరువాత టాటా పంచ్ మైక్రో ఎస్‌యువికి ప్రత్యర్థిగా నిలబడనున్న ఎక్స్‌టర్ తప్పకుండా అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కావున ఇందులోని అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్ బ్యాగులు, హై ఎండ్ వేరియంట్లలో డ్యూయెల్ కెమెరా సెటప్, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎన్ విత్ ఈబీడీ వంటివి లభిస్తాయి.

(ఇదీ చదవండి: ఖరీదైన కారు కాలిపోతే కంపెనీకి థ్యాంక్స్ చెప్పిన ఓనర్ - వైరల్ పోస్ట్ & వీడియో)

ప్రత్యర్థులు & అంచనా ధర
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ దీని ప్రారంభ ధర రూ. 6 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇది 'టాటా పంచ్, సిట్రోయెన్ సి3' వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top