కార్గో ఈ-త్రీవీలర్లకు రాయితీల పొడిగింపు | Govt notifies 2nd phase of PM e Drive to extend subsidies on cargo three wheelers | Sakshi
Sakshi News home page

కార్గో ఈ-త్రీవీలర్లకు రాయితీల పొడిగింపు

Nov 28 2024 8:10 AM | Updated on Nov 28 2024 8:15 AM

Govt notifies 2nd phase of PM e Drive to extend subsidies on cargo three wheelers

న్యూఢిల్లీ: కార్గో ఎలక్ట్రిక్‌ త్రీ–వీలర్ల కొనుగోలుపై రాయితీలకు సంబంధించి పీఎం ఈ–డ్రైవ్‌ పథకం రెండవ దశను కేంద్రం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 80,546 యూనిట్లకు రాయితీ మంజూరు చేయాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అయితే నిర్ధేశించిన లక్ష్యాన్ని గడువు కంటే ముందే నవంబర్‌ 7 నాటికే చేరుకుంది.

దీంతో 2025 ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కావాల్సిన రెండవ దశను ముందుగానే ప్రారంభించాల్సి వచ్చింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌5 విభాగంలో 1,24,846 యూనిట్ల ఎలక్ట్రిక్‌ కార్గో త్రిచక్ర వాహనాలకు రాయితీ ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. నవంబర్‌ 26న జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం 2024 నవంబర్‌ 8 నుంచి 2026 మార్చి 31 మధ్య మొత్తం 1,24,846 యూనిట్ల ఎలక్ట్రిక్‌ కార్గో త్రీ–వీలర్లకు కిలోవాట్‌ అవర్‌కు రూ.2,500 సబ్సిడీ ఉంటుంది.

రాయితీ కింద గరిష్టంగా ఒక్కో వాహనానికి రూ.25,000 అందిస్తారు. గతంలో ఈ మొత్తం కిలోవాట్‌ అవర్‌కు రూ.5,000 సబ్సిడీ ఇచ్చేవారు. గరిష్టంగా రూ.50,000 ఉండేది. పీఎం ఈ–డ్రైవ్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.10,900 కోట్లు కేటాయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement