బంగారం ధరల్లో భారీ మార్పు! | Gold Rate Update in India - Check The Latest Price | Sakshi
Sakshi News home page

బంగారం ధరల్లో భారీ మార్పు!

Oct 10 2026 7:56 PM | Updated on Oct 10 2026 8:34 PM

Gold Rate Update in India - Check The Latest Price

గతవారం భారీగా తగ్గిన బంగారం ధరలు ఈ వారం (అక్టోబర్ 4 నుంచి 10 వరకు) అమాంతం పెరిగాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో ఊహకందని మార్పులు జరిగాయి. ఈ కథనంలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అక్టోబర్ 04న హైదరాబాద్, విజయవాడలలో రూ.1,49,180 వద్ద ఉన్న 10 గ్రాముల బంగారం ధర నేటికి (అక్టోబర్ 10) రూ.1,51,420 వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో గోల్డ్ రేటు రూ.2240 పెరిగిందన్న మాట. 22 క్యారెట్ల బంగారం రేటు రూ.1,36,750 నుంచి రూ.1,38,800 వద్దకు (రూ.2050 పెరిగింది) చేరింది.

చెన్నైలో కూడా బంగారం ధరల్లో మార్పులు కనిపించాయి. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు వారం రోజుల్లో 1,49,180 రూపాయల నుంచి 1,51,420 రూపాయల (రూ.2240 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల బంగారం రేటు రూ.1,36,750 నుంచి రూ.1,38,800 వద్దకు (రూ.2050 పెరిగింది) చేరింది.

ఢిల్లీ విషయానికి వస్తే.. ఈ నగరంలో ఏడు రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,49,330 వద్ద నుంచి రూ.1,51,570 వద్దకు (రూ.2240 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల బంగారం రేటు రూ.1,36,900 నుంచి రూ.1,38,950 వద్దకు (రూ.2050 పెరిగింది) చేరింది.

ఇదీ చదవండి: చాట్‌జీపీటీ సాయం.. సివిల్ సర్వీసెస్‌లో విజయం!

ఈరోజు ధరలు ఇలా..
బంగారం ధరలు ఈ రోజు (శనివారం) కూడా పెరుగుదల దిశగా అడుగులు వేశాయి. దీంతో బంగారం ధరలు మళ్లీ పరుగులు పెట్టింది. నేడు ఏ నగరం పసిడి ధరలు ఎలా ఉన్నాయో కింద చూడవచ్చు.

బంగారం ధరలు1
1/4

బంగారం ధరలు2
2/4

బంగారం ధరలు3
3/4

బంగారం ధరలు4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement