అంతలోనే ఇంతలా.. బంగారం కొత్త ధరలు ఇలా! | Gold Prices Rebound After Recent Decline, Witness Fresh Upside Movement Across Key Indian Cities | Sakshi
Sakshi News home page

అంతలోనే ఇంతలా.. బంగారం కొత్త ధరలు ఇలా!

Jun 25 2026 9:15 PM | Updated on Jun 26 2026 1:46 PM

Gold Prices Rebound After Recent Decline Rates Rise Across Major Cities

భారతదేశంలో బంగారం తగ్గుదలకు బ్రేక్ పడింది. వరుసగా తగ్గుతున్న గోల్డ్ రేటు.. పెరుగుదల దిశగా అడుగులు వేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో కొత్త రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు (జూన్ 25) ఉదయం రూ.1,28,450 వద్ద ఉన్న తులం 22 క్యారెట్స్ బంగారం ధర సాయంత్రానికి రూ.1,29,550 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,40,130 నుంచి రూ.1,41,330 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలో పసిడి ధరలు ఎంతగా మారాయో స్పష్టంగా తెలుస్తోంది.

ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో మార్పులు జరిగాయి. ఇక్కడ ఉదయం రూ.1,28,600 వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.1,29,700 వద్దకు చేరింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,40,280 నుంచి రూ.1,41,480 వద్దకు చేరింది.

అయితే చెన్నైలో మాత్రం ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.131400 వద్ద, 24 క్యారెట్ల రేటు రూ.1,43,350 వద్ద ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement