పసిడి ప్రియులకు షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు! | Gold Prices Rebound Sharply Across India, Sudden Rise Replaces Early Decline In Major Cities, More Details Inside | Sakshi
Sakshi News home page

పసిడి ప్రియులకు షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు!

Jun 30 2026 9:02 PM | Updated on Jul 1 2026 10:46 AM

Gold Market Twist Prices Rise After Falling Briefly

బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పు జరుగుతున్నాయి. అయితే నేడు (మంగళవారం) పసిడి ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది. దీంతో ఒక్కసారిగా గోల్డ్ రేటు పెరిగిపోయింది. ఈ కథనంలో లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.

హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు (జూన్ 30) ఉదయం రూ.1,28,450 వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం ధర.. సాయంత్రానికి రూ.1,30,200 రూపాయల వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలోనే పసిడి ధరల్లో భారీ మార్పు (రూ.1750 పెరిగింది) జరిగిందని స్పష్టమవుతోంది. 24 క్యారెట్ల ధర రూ.1,40,130 నుంచి రూ.1,42,040 (రూ.1910 పెరిగింది) వద్దకు చేరింది.

ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో మార్పు సంభవించింది. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,28,600 రూపాయల నుంచి రూ.1,30,350  వద్దకు, 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.1,40,280 నుంచి రూ.1,42,190 వద్దకు చేరింది.

అయితే చెన్నైలో మాత్రం బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.1000 తగ్గి రూ.1,32,000 వద్ద, 24 క్యారెట్ల రేటు రూ.1090 తగ్గి రూ.1,44,000 వద్ద నిలిచాయి.

మొత్తం మీద దేశంలో గోల్డ్ రేటు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరుగుదల దిశగా అడుగులు వేయడం వల్ల, పసిడి ప్రియులలో ఆందోళన మొదలైంది. అయితే రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు మాత్రం రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement