కొండ దిగుతున్న కనకం | Gold and Silver Prices falling | Sakshi
Sakshi News home page

కొండ దిగుతున్న కనకం

Jun 26 2026 7:21 AM | Updated on Jun 26 2026 11:00 AM

Gold and Silver Prices falling

న్యూఢిల్లీ: పసిడి, వెండి గురువారం కూడా దేశీ మార్కెట్లో నష్టాలను చవిచూశాయి. క్రితం రోజు ప్రపంచ మార్కెట్లలో ఈ రెండు లోహాలు భారీగా పడిపోయిన నేపథ్యంలో.. దేశీ బులియన్‌ మార్కెట్‌పైనా ఇది ప్రతి ఫలించింది. 10 గ్రాముల బంగారం రూ.2,800 నష్టంతో రూ.1,45,300 వద్దకు దిగొచ్చింది.

వెండి కిలోకి రూ.5,000 తగ్గి రూ.2,26,000 స్థాయికి పరిమితమైంది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం పసిడి, వెండి లాభ, నష్టాల మధ్య ట్రేడవుతున్నాయి. ఒక దశలో పసిడి అర శాతం తగ్గగా.. తర్వాత 1% వరకు పుంజుకుని  ఔన్స్‌కు 4,033 డాలర్ల స్థాయిని అందుకుంది. వెండి ధర ఔన్స్‌కు 2 శాతానికి పైగా లాభపడి 58.57 డాలర్ల స్థాయిని చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement