ది గ్లైడర్ అడ్వాంటేజ్: ఒత్తిడిలోనూ విజయం! | The Glyder Advantage New Book on Mental Strength Peak Performance | Sakshi
Sakshi News home page

ది గ్లైడర్ అడ్వాంటేజ్: ఒత్తిడిలోనూ విజయం!

Jul 11 2026 1:19 PM | Updated on Jul 11 2026 2:03 PM

The Glyder Advantage New Book on Mental Strength Peak Performance

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉన్నారు. విద్యార్థులకు పరీక్షల ఒత్తిడి, ఉద్యోగులకైతే లక్ష్యాలను చేరుకోవాలనే ఒత్తిడి, వ్యాపారవేత్తలకు విజయాన్ని సాధించాల్సిన ఒత్తిడి, క్రీడాకారులకు గెలుపుకోసం ఒత్తిడి ఉంటుంది. ఇలా చెప్పుకుంటూపోతే సమాజంలోని ప్రతి ఒక్కరు ఒత్తిడితో కూడిన జీవితాలను గడిపేస్తున్నారని తెలుస్తోంది.

ఒత్తిడి ఉన్నప్పుడు.. ప్రతిభ వెలుగులోకి రావడం కొంత కష్టం. ఈ సమస్యకు పరిష్కారం చూపించే ఉద్దేశంతో 'ది గ్లైడర్ అడ్వాంటేజ్ - బీట్ ది ప్రెజర్, పర్ఫామ్ ఎట్ యువర్ బెస్ట్' అనే పుస్తకం విడుదల చేశారు.

ప్రపంచ స్థాయి క్రీడాకారులు ఒత్తిడిని ఎలా అధిగమిస్తారు?, ఎలాంటి మానసిక నైపుణ్యాలతో విజయాలను సాధిస్తారు?, అనే అంశాలను ఈ పుస్తకంలో సులభంగా వివరించారు. ఈ నైపుణ్యాలు కేవలం క్రీడాకారులకే కాకుండా.. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, సాధారణ వ్యక్తులు కూడా తమ రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని వివరించారు.

ఈ పుస్తకాన్ని భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ ఆవిష్కరించారు. ఎన్నో విజయవంతమైన క్రీడాకారులను తీర్చిదిద్దిన కోచ్‌గా ఆయనకు ఉన్న అనుభవం ఈ పుస్తకానికి మరింత విశ్వసనీయతను తీసుకొచ్చింది. ఒత్తిడిని సరైన విధంగా ఎదుర్కొనే సామర్థ్యం ఉంటేనే దీర్ఘకాలిక విజయాలు సాధ్యమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రముఖ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ డాక్టర్ శాండీ గార్డన్, గోపినాథన్ సి.పీ (గోపీ), రీతూ వినాయక్ కలిసి ఈ పుస్తకాన్ని రచించారు. ఒత్తిడి వల్ల పనితీరు తగ్గిపోవడం సహజమేనని, అయితే మానసిక నైపుణ్యాలను అభ్యసించడం ద్వారా ఎవరైనా తమ పనితీరును మెరుగుపరుచుకోవచ్చని వారు చెబుతున్నారు.

రచయితల మాటల్లో చెప్పాలంటే.. ఈ పుస్తకం కేవలం చదివి పక్కన పెట్టేలా ఉండదు. ప్రతి అధ్యాయం చివరలో వెంటనే ఆచరణలో పెట్టగలిగే మానసిక సాధనలు, టెక్నిక్‌లు ఉన్నాయి. దీంతో పాఠకులు వాటిని తమ రోజువారీ జీవితంలో ఉపయోగించి ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement