మార్కెట్లపై జీడీపీ ఎఫెక్ట్‌  | GDP, Inflation and Unemployment Impact the Stock Market | Sakshi
Sakshi News home page

మార్కెట్లపై జీడీపీ ఎఫెక్ట్‌ 

Jun 2 2025 6:27 AM | Updated on Jun 2 2025 6:27 AM

GDP, Inflation and Unemployment Impact the Stock Market

ఆర్‌బీఐ సమీక్షపై ఇన్వెస్టర్ల చూపు 

టారిఫ్‌ చర్చలకూ ప్రాధాన్యత 

ఇండెక్సులకు ఎఫ్‌పీఐల దన్ను 

ఈ వారం ట్రెండ్‌పై విశ్లేషకుల అంచనా

గత వారాంతాన వెలువడిన జీడీపీ గణాంకాలు ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. మరోవైపు ఆర్‌బీఐ పాలసీ సమీక్షపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎఫ్‌పీఐ పెట్టుబడులు, యూఎస్‌ టారిఫ్‌ పరిస్థితులు తదితర అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. 

ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో దేశ ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం బలపడింది. చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 7.4 శాతం వృద్ధి చూపింది. జీడీపీ విలువ 3.9 లక్షల కోట్ల డాలర్లకు చేరడం సానుకూల అంశమని విశ్లేషకులు పేర్కొన్నారు. గత వారాంతాన వెలువడిన జీడీపీ గణాంకాలు ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లపై ప్రభావాన్ని చూపనున్నట్లు తెలియజేశారు. ఇక మరోపక్క ఆర్‌బీఐ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) మూడు రోజుల సమావేశం బుధవారం(4న) ప్రారంభంకానుంది. శుక్రవారం(6న) పాలసీ సమీక్షా నిర్ణయాలు వెలువడనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు వడ్డీ రేట్ల నిర్ణయాలపై దృష్టిపెట్టనున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా తెలియజేశారు. ఈ వారం మే నెల తయారీ, సరీ్వసుల రంగ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. ఆర్‌బీఐ గత(ఏప్రిల్‌) సమీక్షలో రెపో రేటును 0.25 శాతం తగ్గించి 6 శాతానికి దించిన సంగతి తెలిసిందే.

గణాంకాలు కీలకం 
మే నెలకు ఆటో అమ్మకాల గణాంకాలు వెలువడుతున్నాయి. వీటికితోడు జీఎస్‌టీ వసూళ్లు తదితర అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ వెల్త్‌మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. ఇటీవల ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో యూఎస్‌ డాలరు ఆటుపోట్లను చవిచూడటం, 10ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్‌ క్షీణించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు వివరించారు. దేశీయంగా ఆర్‌బీఐ రెపో రేటులో 0.25 శాతం కోత పెట్టవచ్చన్న అంచనాలున్నట్లు జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయిర్‌ పేర్కొన్నారు. ఈ  నేపథ్యంలో పీఎస్‌యూ బ్యాంకులు యాక్టివ్‌గా కదిలే వీలున్నట్లు ఖేమ్కా అభిప్రాయపడ్డారు. జీఎస్‌టీ వసూళ్లు, ఆటో విక్రయాలు, జీడీపీ తదితర ఆర్థిక గణాంకాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చే వీలున్నట్లు అధిక శాతంమంది నిపుణులు అంచనా వేశారు.  

ఇతర అంశాలు 
గత నెల(మే)లో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో కొనుగోళ్లకు ఆసక్తి చూపడం సానుకూల అంశమని విశ్లేషకులు పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్‌ నుంచి మార్చివరకూ అమ్మకాలకే అధిక ప్రాధాన్యమిచ్చిన ఎఫ్‌పీఐలు ఇటీవల నికర పెట్టుబడిదారులుగా నిలుస్తుండటం సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు తెలియజేశారు. డాలరుతో మారకంలో రూపాయి బలపడటం, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, ముడిచమురు ధరలు దిగిరావడం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థకు దన్నునివ్వగలవని అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ గతేడాదికి సరికొత్త రికార్డ్‌ నెలకొల్పుతూ ప్రభుత్వానికి భారీ డివిడెండ్‌ చెల్లించడం ప్రభుత్వ పెట్టుబడులకు దన్నునిస్తుందని తెలియజేశారు. ప్రెసిడెంట్‌ ట్రంప్‌ టారిఫ్‌ల విధింపునకు యూఎస్‌ ఫెడరల్‌ కోర్టు చెక్‌ పెట్టిన నేపథ్యంలో విదే శీ పెట్టుబడులు పుంజుకోవచ్చని అంచనా వేశారు.

పెట్టుబడులకే ఎఫ్‌పీఐల మొగ్గు 
మే నెలలో రూ. 19,860 కోట్లు 
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గత నెలలో పెట్టుబడులకే ఆసక్తి చూపా రు. వెరసి మే నెలలో నికరంగా రూ. 19,860 కోట్ల విలువైన దేశీ స్టాక్స్‌ కొనుగోలు చేశారు. అంతకుముందు ఏప్రిల్‌లో అమ్మకాలు, కొను గోళ్ల మధ్య నికరంగా రూ. 4,223 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. 2024 అక్టోబర్‌లో అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వచ్చిన ఎఫ్‌పీఐలు ఈ ఏడాది (2025) జనవరిలో రూ. 78,027 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు, మార్చిలో రూ. 3,973 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. అయితే ఆపై ఏప్రిల్‌ చివరి నుంచి కొనుగోళ్ల యూటర్న్‌ తీసుకోవడం గమనార్హం! 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement