ఇంధన పరివర్తనలో కలసి పనిచేస్తాం: కొత్త ఇన్వెస్ట్‌మెంట్‌  ప్లాట్‌ఫామ్‌

G20 US to help India lower energy transition cost through new investment platform - Sakshi

G20 గుజరాత్‌ రాజధాని నగరం గాంధీ నగర్‌లో  మూడవ  జీ20 ఆర్థికమంత్రులు,కేంద్రబ్యాంకుల సమావేశం  సోమవారం మొదలైంది.  గుజరాత్ రాజధానిలో జూలై 14 నుండి 15 వరకు G20 ఫైనాన్స్  అండ్‌ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీస్ (FCBDs) సమావేశం జరుగుతుంది.  పీఎం మోదీ అమెరికా పర్యటన అమెరికా-భారత్ భాగస్వామ్యంలో బలాన్ని, చైతన్యాన్ని పెంచిందని కేంద్ర  ఆర్థిక మంత్రి  సీతారామన్ వ్యాఖ్యానించారు.

రెండు దేశాల ఆర్థిక అధిపతులు చేసిన ప్రకటనల ప్రకారం  ఇండియా-అమెరికా దేశాలు కొత్త ఇన్వెస్ట్‌మెంట్‌ వేదిక ద్వారా ఇంధన పరివర్తన వ్యయాన్ని తగ్గించడానికి కలిసి పనిచేయాలని అంగీకరించాయి. అభివృద్ధి సహకారం , పునరుత్పాదక ఇంధనం కోసం ప్రత్యామ్నాయ పెట్టుబడి వేదికల ద్వారా కొత్త పెట్టుబడి అవకాశాల ద్వారా ఇదరు దేశాల  ద్వైపాక్షిక ప్రయోజనాలను మరింతగా పెంచుకోవడానికి ఎదురుచూస్తున్నట్లు  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ తన సొంత ప్రకటనలో,  ఇండియా  ఎనర్జీ ట్రాన్సిషన్‌ ప్రక్రియను మరింత  వేగవంతం చేయడానికి తక్కువ ఖర్చుతో కూడిన మూలధనాన్ని,  ప్రైవేట్ పెట్టుబడులను పెంచడానికి పెట్టుబడి వేదికపై భారతదేశంతో కలిసి పనిచేసేందుకు తాము కూడా  ఎదురు చూస్తున్నామని చెప్పారు.

ఆర్థికమంత్రి, ఆర్‌బీఐ గవర్నర్ డాక్టర్ శక్తికాంత దాస్ సంయుక్త అధ్యక్షతన జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి,  66 మంది ప్రతినిధులు పాల్గొంటున్నఈ మీట్‌లో గ్లోబల్ ఎకానమీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్‌కు సంబంధించిన అనేక అంశాలు చర్చకు  రానున్నాయి.

 ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగిన మొదటి జీ20 ఎఫ్‌ఎంసీబీజీ  కాన్‌క్లేవ్‌ ఆధారంగా అనేక కీలక బట్వాడాలకు సంబంధించిన పనికి పరాకాష్టగా నిలుస్తుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ అజయ్ సేథ్  వెల్లడించిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top