తగ్గిన ఇంధన వాడకం | Fuel consumption in June 2025 decline due to early monsoon | Sakshi
Sakshi News home page

తగ్గిన ఇంధన వాడకం

Jun 17 2025 1:41 PM | Updated on Jun 17 2025 1:50 PM

Fuel consumption in June 2025 decline due to early monsoon

దేశీయంగా వివిధ ప్రాంతాల్లో ముందుగా వర్షాలు పడుతుండటంతో ఈ నెల(జూన్‌) తొలి రెండు వారాల్లో ఇంధన వినియోగం మందగించింది. ప్రొవిజనల్‌ పారిశ్రామిక గణాంకాల ప్రకారం రెండు నెలల పురోగతి తదుపరి డీజిల్‌ వినియోగం క్షీణించింది. ఈ బాటలో రెండు నెలల వినియోగ వృద్ధి తదుపరి పెట్రోల్‌కు సైతం డిమాండ్‌ నీరసించింది.

జూన్‌ 1–15 మధ్య పెట్రోల్‌ డిమాండ్‌లో వృద్ధి 2.3 శాతానికి పరిమితమై 1.4 మిలియన్‌ టన్నులను తాకింది. దేశీయంగా 90 శాతం మార్కెట్‌ వాటా కలిగిన మూడు ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్‌ సంస్థల గణాంకాలివి. మే నెలలో పెట్రోల్‌ డిమాండ్‌ 9 శాతం పుంజుకున్న సంగతి తెలిసిందే. జూన్‌ తొలి అర్ధభాగంలో డీజిల్‌ వినియోగం 4.8 శాతం క్షీణించింది. 3.26 మిలియన్‌ టన్నులకు పరిమితమైంది.

ఇదీ చదవండి: రూ.10,000లోపు కొత్త 5జీ ఫోన్లు

దేశీయంగా అత్యధిక వినియోగమున్న డీజిల్‌ ఏప్రిల్‌లో 4 శాతం బలపడగా.. మే నెలలో 2 శాతం వృద్ధి నమోదైంది. ఈ నెల తొలి రెండు వారాల్లో పెట్రోల్‌ అమ్మకాలు 7 శాతం తగ్గాయి. మే నెల 1–15 మధ్య 1.5 మిలియన్‌ టన్నుల పెట్రోల్‌ వినియోగం నమోదైంది. అయితే 2023 జూన్‌ 1–15తో చూస్తే వినియోగం 7 శాతం ఎగసింది. మరోపక్క ఇదే కాలంలో డీజిల్‌ డిమాండ్‌ 5.2 శాతం క్షీణించగా.. వినియోగం మే నెలతో పోలిస్తే 3.1 శాతం తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు పెరగడానికి వినియోగం ఊతమిచ్చింది.
 

Advertisement
 
Advertisement
Advertisement