పండుగ సీజన్ మొదలైపోయింది. దసరా, దీపావళి పండుగలు వెంటవెంటనే వస్తున్నాయి. దీంతో షాపింగ్ హంగామా కూడా అప్పుడే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలు తమ ఆఫర్ల జాతరను ప్రకటించేశాయి.
దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ తమ అతిపెద్ద సేల్ ‘ది బిగ్ బిలియన్ డేస్ 2026’ను ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ 13వ ఎడిషన్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభమవుతుందని ఫ్లిప్ కార్ట్ తాజాతా వెల్లడించింది. ప్లస్, బ్లాక్, ఫ్లిప్ కార్ట్ క్రెడిట్ కార్డు సభ్యులకు అక్టోబర్ 8 నుంచి ఎర్లీ యాక్సెస్ ప్రారంభమవుతుంది.
పదమూడేళ్ల క్రితం ప్రారంభమైన ‘ది బిగ్ బిలియన్ డేస్’ భారతదేశపు అతి పెద్ద పండుగ షాపింగ్ సేల్‌గా ప్రసిద్ధి చెందింది. ఈసారి సేల్ సందర్భంగా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విక్రేతల భాగస్వామ్యం అవుతున్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారింత నడిచే షాపింగ్ అనుభవాన్ని అందించబోతున్నారు. ఇప్పటి వరకు ఫ్లిప్ కార్ట్ అత్యంత విస్తృతమైన సప్లై ఛైయిన్ నెట్ వర్క్ దేశవ్యాప్తంగా 8,200కు పైగా ఫుల్ ఫిల్ మెంట్ కేంద్రాలు డెలివరీ సదుపాయాలకు విస్తరించింది.
ఫ్లిప్ కార్ట్ గ్రూప్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ‘పదమూడేళ్ల క్రితం భారతదేశంలో డిజిటల్ కామర్స్ అనేది ఒక కొత్తదనం.నేడు అది మౌలికంగా మారింది. 50 కోట్ల మంది నమోదిత కస్టమర్లు, 14 లక్షల విక్రేతలతో బిగ్ బిలియన్ డేస్ బహుశా ఆ మార్పుకు స్పష్టమైన వార్షిక రుజువు’ అని పేర్కొన్నారు. ఈ సంవత్సరం మొదటిసారిగా లేహ్, కార్గిల్‌ని ప్రాంతాలకు సరఫరా గొలుసును విస్తరించామని, ఒక్క ఈ పండుగ సీజన్ కోసమే దాదాపు 75,000 మందిని నియమించుకున్నామని వివరించారు.
ఈసారి బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రోజువారీ నిత్యావసరాల నుండి ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రానిక్స్, ప్రీమియం ఫ్యాషన్, బ్యూటీ, భారీ అప్లయన్స్‌లు, పండుగ బహుమతుల వరకు ప్రతి కేటగిరీలోని బ్రాండ్ల నుండి 15 కోట్ల ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తుతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. 13వ ఎడిషన్ లో మొబైల్స్, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు వంటి భారీ అప్లయన్స్‌లు, బ్యూటీ, పర్సనల్ కేర్‌లో విస్తృతమైన కొత్త లాంచ్ లైనప్ ఉంటుందని, 1,200 పైగా ఫ్యాషన్ ట్రెండ్ ఉత్పత్తులు అత్యల్ప ధరలకు లభిస్తాయని వివరించింది.
ఇదీ చదవండి: ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. ప్లాన్‌ల ధరలు పెంపు


