
ఫెనాన్స్ బుద్ధ లిస్టింగ్‌కు లైన్ క్లియర్
సుప్రసిద్ధ క్రికెటర్ ఎంఎస్ ధోని, ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా, క్యామ్స్ వ్యవస్థాపకుడు వి.శంకర్‌కు పెట్టుబడులున్న ఫిన్‌బడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ తాజాగా సూత్రప్రాయ అంగీకారాన్ని తెలియజేసింది. ఫైనాన్స్ బుద్ధ బ్రాండుతో రుణ సౌకర్యాలకు దారిచూపే కంపెనీ.. ఎస్‌ఎంఈ విభాగంలో నిధుల సమీకరణ చేపట్టనుంది.
దీని ద్వారా ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ ఫిజిటల్ రుణాల సంస్థ లిస్ట్‌కానుంది. ఐపీవోలో భాగంగా రూ.10 ముఖ విలువగల 50.48 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, అనుబంధ సంస్థ ఎల్‌టీసీవీ క్రెడిట్‌లో పెట్టుబడులు, బిజినెస్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్ కార్యకలాపాలతోపాటు.. రుణ చెల్లింపులకు వినియోగించనుంది. ఫిన్‌బడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను 2012లో వివేక్ భాటియా, పార్థ్ పాండే, పరాగ్ అగర్వాల్ ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: చెప్పులు ధరించి డ్రైవింగ్ చేస్తే చలానా!?