
జులైలో 5 శాతం పెరిగిన సభ్యులు
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) నిర్వహించే సామాజిక భద్రతా పథకం (ఈఎస్‌ఐ) కిందకు జూలైలో కొత్తగా 20.36 లక్షల మంది సభ్యులు చేరారు. ఈ ఏడాది జూన్ నెలతో పోల్చి చూస్తే 5 శాతం వృద్ధి నమోదైంది. జూన్‌లో సభ్యుల చేరిక 19,37,314గా ఉంది. కార్మిక శాఖ ఈ వివరాలను విడుదల చేసింది.
31,146 సంస్థలు కొత్తగా ఈఎస్‌ఐ పథకం కింద నమోదు చేసుకున్నాయి.
మొత్తం 20.36 లక్షల సభ్యుల్లో 9.85 లక్షల మంది (48 శాతం) వయసు 25 ఏళ్లలోపే ఉంది.
నికర మహిళా సభ్యుల చేరిక 4.33 లక్షలుగా ఉంది.
ఈఎస్‌ఐ పథకం కింద 88 మంది ట్రాన్స్‌జెండర్లు సైతం పేర్లను నమోదు చేసుకున్నారు.
ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్ ‘స్వదేశీ’ 4జీ నెట్‌వర్క్