
ఎపిక్ వరల్డ్ తాజాగా ఎంటర్‌ప్రెన్యూరల్ హౌస్‌హోల్డ్స్ ఇండియా(ఈహెచ్‌ఐ) ఇండెక్స్‌ను ఆవిష్కరించింది. మార్నింగ్‌స్టార్ ఇండెక్సెస్‌తో కలసి రూపొందించిన ఈ సూచీలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తదితరాలకు చోటు కల్పించింది.
తద్వారా 34 లిస్టెడ్ సంస్థల పనితీరును ట్రాక్ చేసేందుకు వీలుంటుందని ఎపిక్ వరల్డ్ పేర్కొంది. ఇండెక్సుకు ప్రాతినిధ్యం వహించే కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 115 బిలియన్ డాలర్లుగా వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన ఐదేళ్లలో ఆదాయం 22 శాతం చొప్పున పుంజుకున్నట్లు తెలియజేసింది.
ఇంపాక్ట్ ఇన్వెస్టర్ ఎలెవర్ ఈక్విటీ మద్దతుతో ఈ గ్లోబల్ ప్లాట్‌ఫామ్ 50 బ్లూ-చిప్ కంపెనీలను ఎంటర్‌ప్రెన్యూరల్ హౌస్‌హోల్డ్స్‌కు (ఇహెచ్ఎస్) అందించడానికి వీలు కల్పిస్తుంది. వచ్చే 20 ఏళ్లలో ఎంటర్‌ప్రెన్యూరల్ హౌస్‌హోల్డ్స్10 రెట్లు వృద్ధి చెందుతాయని భావిస్తున్న ఎపిక్ వరల్డ్ భారత్లో 100 ట్రిలియన్ డాలర్ల అవకాశాలను తెరవనుంది.