EPFO గుడ్‌న్యూస్‌.. ఇక అలాంటి రిజెక్షన్స్‌ ఉండవు | EPFO clears air on PF transfer delays due to overlapping employment dates | Sakshi
Sakshi News home page

EPFO గుడ్‌న్యూస్‌.. ఇక అలాంటి రిజెక్షన్స్‌ ఉండవు

May 30 2025 5:40 PM | Updated on May 30 2025 6:02 PM

EPFO clears air on PF transfer delays due to overlapping employment dates

ఉద్యోగాలు మారినప్పుడు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) బదిలీ ప్రక్రియలో తలెత్తుతున్న ఇబ్బందులను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తొలగించింది. వివిధ సంస్థల్లో పనిచేసిన సందర్భంలో సర్వీస్‌ వ్యవధులు సరిపోలని కారణంగా పీఎఫ్ బదిలీ క్లెయిమ్‌లు తిరస్కరణకు గురవుతున్నాయి. దీనిపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు కొత్త వివరణ ఇచ్చింది. ఇలాంటి సాంకేతికతల కారణంగా ఆలస్యాన్ని ఎదుర్కొన్న వేతన జీవులకు ఇది ఉపశమనం కలిగిస్తుంది.


పీఎఫ్ బదిలీ క్లెయిమ్స్ ఎందుకు స్తంభిస్తున్నాయంటే..
ఇటీవలి కొన్ని నెలలుగా అనేక ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాలు (ఆర్పిఎఫ్ఓలు) పీఎఫ్ బదిలీ అభ్యర్థనలను తిరస్కరించడమో లేదా తిరిగి పంపడమో చేస్తున్నాయి. ఒక ఉద్యోగాన్ని అధికారికంగా విడిచిపెట్టడానికి ముందే కొత్త ఉద్యోగంలో చేరినవారి విషయంలో ఇది ఎ‍క్కువగా జరుగుతోంది. రెండు సంస్థలలో ఏక కాలంలో పనిచేసినట్లు ఉండటంతో ప్రాసెసింగ్ ఆలస్యం అవుతోంది.

👉 ఇది చదివారా? కొత్త ఈపీఎఫ్‌వో.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.. జూన్‌ 1 నుంచి కీలక మార్పులు


ఈపీఎఫ్‌వో తాజా ఆదేశాలు
పీఎఫ్‌ బదిలీ క్లెయిమ్‌ను పూర్తిగా తిరస్కరించడానికి సర్వీసు వ్యవధిని కారణాలుగా పరిగణించరాదని స్పష్టం చేస్తూ న్యూఢిల్లీలోని ఈపీఎఫ్ఓ ప్రధాన కార్యాలయం మే 20న ఒక సర్క్యులర్ జారీ చేసింది. పెన్షన్ డివిజన్ గతంలో జారీ చేసిన సర్క్యులర్‌ను కూడా ఇందులో ప్రస్తావించింది. ఎక్కువ ఖాతా నంబర్‌లున్న సందర్భాల్లో ఈపీఎస్ ప్రయోజనాలను ఎలా నిర్వహించాలో ఆ సర్క్యులర్‌లో మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగి రికార్డులో సర్వీస్‌ ఓవర్‌ ల్యాప్‌ ఉన్నప్పటికీ పీఎఫ్ బదిలీ క్లెయిమ్లను ప్రాసెస్ చేయాలని అన్ని బదిలీ కార్యాలయాలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement