వాట్సాప్‌లో సేవలు.. ఆటోమేటిక్‌గా EPFO సెటిల్‌! | Provident Fund Services Launched On WhatsApp | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో సేవలు.. ఆటోమేటిక్‌గా EPFO సెటిల్‌!

Nov 2 2026 9:49 AM | Updated on Nov 2 2026 10:08 AM

Provident Fund Services Launched On WhatsApp

వాట్సాప్‌ ద్వారా ఈపీఎఫ్‌వో సేవలను పొందే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఉద్యోగుల భవిష్య నిధి 74వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఈ సర్వీసులను ఆవిష్కరించారు.

ఈపీఎఫ్‌ సబ్‌స్క్రైబర్స్.. తమ ప్రావిడెంట్‌ ఫండ్‌ బ్యాలెన్సు, గత ఐదు లావాదేవీలు, పాస్‌బుక్‌ వివరాలను వాట్సాప్‌ ద్వారా పొందవచ్చు. మరోవైపు.. క్రియాశీలకంగా లేని ఈపీఎఫ్‌ ఖాతాల ఆటోమేటిక్‌ సెటిల్మెంట్‌ ప్రక్రియను కూడా మంత్రి ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఖాతాలో రూ.1,000 వరకు బ్యాలెన్స్‌ ఉండి, ఆధార్‌తో అనుసంధానమైన అకౌంట్లు ఉన్న సబ్‌స్క్రైబర్స్ వ్యక్తిగతంగా క్లెయిమ్‌లను దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా.. ఆటోమేటిక్‌గా ఈపీఎఫ్‌వో సెటిల్‌ చేస్తుంది. దీనితో దాదాపు ఒక లక్ష అకౌంట్లకు సుమారు రూ.5 కోట్ల వరకు ప్రయోజనం చేకూరవచ్చని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement