పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్
బాండ్ల ఈల్డ్స్, ఎఫ్‌పీఐలకూ ప్రాధాన్యం
ఆటో సేల్స్, గణాంకాలు కీలకం
ఈ వారం స్టాక్ మార్కెట్లపై అంచనా
దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను ఈ వారం పలు దేశ, విదేశీ అంశాలు నిర్దేశించనున్నాయి. ఇప్పటికే జోరందుకున్న జూలై–సెపె్టంబర్(క్యూ2) ఫలితాలు, మంట పుట్టిస్తున్న ముడిచమురు ధరలు, ఆర్థిక గణాంకాలు కీలకంగా నిలవనున్నాయి. మరోపక్క పెట్టుబడుల్లో విదేశీ ఇన్వెస్టర్ల తీరు, పెరుగుతున్న వడ్డీ రేట్లు సైతం ప్రభావం చూపనున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ ఇప్పటికే బాగా వేడెక్కింది. ఈ వారం మరికొన్ని కంపెనీలు క్యూ2 ఫలితాలు ప్రకటించనున్నాయి. మరోవైపు అక్టోబర్ నెలకు ఆటో రంగ విక్రయాలతోపాటు.. తయారీ, సరీ్వసు రంగాల పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. ఇవికాకుండా అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక పరిస్థితులు సైతం దేశీ స్టాక్ మార్కెట్లలో సెంటిమెంటును ప్రభావితం చేయనున్నాయి.
ఈ వారం క్యూ2 ఫలితాల జాబితాలో ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్(వారాంతాన వెలువడ్డాయ్), ఐటీసీ, మారికో, నాల్కో(నేడు), ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ హోల్డింగ్స్, లుపిన్, ఎంసీఎక్స్, ఎన్‌ఎస్‌ఈ(3న), బీఎస్‌ఈ, లెన్స్‌కార్ట్, నైకా, డాబర్ ఇండియా, బయోకాన్(4న), ఎయిర్‌టెల్, ఎల్‌ఐసీ, టైటన్, ఎంఅండ్‌ఎం, ఓఎన్‌జీసీ, సంవర్ధన మదర్‌సన్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, బ్రిటానియా(5న), హిందాల్కో, గ్లాండ్ ఫార్మా, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్(6న) చేరాయి.
గణాంకాలు...
అక్టోబర్ నెలకుగాను నేడు(2న) హెచ్‌ఎస్‌బీసీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ పీఎంఐ, కాంపోజిట్, సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. ఈ సర్వేలు గత నెలలో తయారీ, సరీ్వసు రంగాల యాక్టివిటీపై వివరాలు వెల్లడించనున్నాయి. దీంతో జీడీపీలో కీలక పాత్ర పోషించే ప్రధాన రంగాల పురోగతి వెల్లడికానుంది. తద్వారా అక్టోబర్‌లో ఆర్థిక వృద్ధి, ఉపాధి, ఉత్పాదకత తదితరాలపై వివరాలు తెలియనున్నాయి. వెరసి ఈ వారం దేశీ కార్పొరేట్ పనితీరుతోపాటు.. ఆర్థిక వ్యవస్థ పురోగతిపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్‌వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు.
విదేశీ అంశాలు...
యూఎస్, ఇరాన్ మధ్య వివాదాలు ముదిరి ఇటీవల తిరిగి ఆందోళనకర పరిస్థితులు తలెత్తడంతో బ్రెంట్ ముడిచమురు ధరలు గత వారం ఒక దశలో బ్యారల్ 118 డాలర్లకు ఎగశాయి. ప్రస్తుతం 112 డాలర్లకు దిగినప్పటికీ దేశీయంగా దిగుమతులు బిల్లుభారంకానుంది. దేశీ చమురు వినియోగంలో 80 శాతంవరకూ దిగుమతులపైనే ఆధారపడుతుంటంతో రూపాయి విలువసైతం డీలా పడుతోంది.
ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం సెగతో జపాన్ నుంచి యూఎస్‌వరకూ కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు ద్వారా కఠిన పరపతి విధానాలు అమలు చేస్తున్నాయి. దీంతో ఇటీవల 10ఏళ్ల యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ 5.35 శాతాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో భారీ అమ్మకాలు కొనసాగించారు. ఇక యూఎస్ మధ్యంతర ఎన్నికలు పాలక పక్షాన్ని(రిపబ్లికన్లు) దెబ్బకొనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి.
ఇది జరిగితే ట్రంప్ సంచలన నిర్ణయాలకు డెమోక్రాట్లు చెక్ పెట్టేందుకు వీలుంటుందని భావిస్తున్నారు. వెరసి దేశ, విదేశీ అంశాలు ఈ వారం కీలకంగా నిలవనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్ల ఈల్డ్స్ పెరిగి అటు పసిడి, ఇటు స్టాక్స్‌పై ప్రతికూల ప్రభావం పడవచ్చని ఆన్‌లైన్ ట్రేడింగ్, వెల్త్‌టెక్ సంస్థ ఎన్‌రిచ్ మనీ సీఈవో ఆర్.పొన్ముడి అభిప్రాయపడ్డారు.
గత వారమిలా..
గత వారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,336 పాయింట్లు(1.8 శాతం) బలపడి 74,460 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 453 పాయింట్లు(2%) ఎగసి 23,053 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు మరింత అధికంగా 3.4–4 శాతం మధ్య జంప్‌చేశాయి.
సాంకేతికంగా చూస్తే..
సాంకేతికంగా చూస్తే ఈ వారం మార్కెట్లలో బ్రేకవుట్‌కు వీలుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 23,200ను అధిగమించవచ్చు. ఇది జరిగితే 23,350–23,500వరకూ బలపడే వీలుంది. ఇందుకు ఈ స్థాయిలలో పటిష్ట కొనుగోళ్లకు తెరలేవవలసి ఉన్నట్లు సాంకేతిక నిపుణులు తెలియజేశారు. ఇలాకాకుండా ఒకవేళ బలహీనపడితే తొలుత 22,810–22,720 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించవచ్చు.
అక్టోబర్‌లో ఎఫ్‌పీఐలు వెనక్కి
రూ. 34,843 కోట్ల విలువైన అమ్మకాలు
న్యూఢిల్లీ: గత నెల(అక్టోబర్)లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీ అమ్మకాలకు తెరతీశారు. వెరసి నికరంగా రూ. 34,843 కోట్ల విలువైన దేశీ స్టాక్స్ విక్రయించారు. అయితే గత నెలాఖరున ఉన్నట్లుండి పెట్టుబడిదారులుగా నిలిచారు. అక్టోబర్ 26–30 మధ్యకాలంలో రూ. 6,300 కోట్ల పెట్టుబడులు చేపట్టారు. కాగా.. అంతకుముందు సెప్టెంబర్‌లో రూ. 35,861 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా.. ఆగస్ట్‌లో రూ. 29,631 కోట్లు, జూలైలో రూ. 20,200 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! అయితే 2026 కేలండర్ ఏడాదిలో ఇప్పటివరకూ నికరంగా రూ. 2.95 లక్షల కోట్ల విలువైన దేశీ స్టాక్స్‌ను అమ్మివేశారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్


