breaking news
Economic Data
-
గణాంకాలపై మార్కెట్ల ఫోకస్
ప్రధానంగా ఆర్థిక గణాంకాలు, వాహన విక్రయాలు, యూఎస్ టారిఫ్‌లు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు దిక్సూచి కానున్నాయి. అంతేకాకుండా ఇటీవల నిరవధికంగా అమ్మకాలకు పాల్పడుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) ధోరణి సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనుంది. మరోపక్క ముగింపు దశకు చేరుకున్న క్యూ1 ఫలితాల సీజన్‌కూ ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం(15న) సెలవుకావడంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. అయితే ద్రవ్యోల్బణ గణాంకాలు, ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలు, యూఎస్‌తో వాణిజ్య సంబంధాలు, ఎఫ్‌పీఐల అమ్మకాలు ఈ వారం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపే వీలున్నట్లు స్టాక్ విశ్లేషకులు చెబుతున్నారు. జూలై నెలకు వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు మంగళవారం(12న) విడుదలకానున్నాయి. జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా 8వ నెలలోనూ దిగివస్తూ 2.1 శాతానికి పరిమితమైంది. 2019 జనవరి తదుపరి ఇది కనిష్టంకాగా.. 2025 మే నెలలో 2.8 శాతంగా నమోదైంది. ఇక జూలై నెలకు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు గురువారం(14న) వెల్లడికానున్నాయి. జూన్‌లో డబ్ల్యూపీఐ అనూహ్యంగా 0.13 శాతం క్షీణించింది. దిగివచ్చింది. మే నెలలో 0.39 శాతం పెరుగుదల నమోదుకాగా.. 2023 అక్టోబర్ తర్వాత తొలిసారి వెనకడుగు వేసింది. క్యూ1 జాబితా ఈ వారం మరికొన్ని దిగ్గజాలు ప్రస్తుత ఏడాది(2025– 26) తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. జాబితాలో పీఎస్‌యూ దిగ్గజాలు ఓఎన్జీసీ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్), ఇండియన్ ఆయిల్(ఐవోసీ)తోపాటు.. ఎస్‌జేవీఎన్, ఐఆర్సీటీసీ, ఆస్ట్రల్ పాలీ, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్, పీఐ ఇండస్ట్రీస్, సంవర్ధన మదర్సన్, ముత్తూట్ ఫైనాన్స్, జూబిలెంట్ ఫుడ్, అశోక్ లేలాండ్, పతంజలి ఫుడ్స్ తదితరాలు చేరాయి. ఇవికాకుండా జూలైలో ప్రయాణికుల వాహన అమ్మకాల వివరాలను సియామ్ 15న విడుదల చేయనుంది. 2025 జూన్‌లో మొత్తం ప్రయాణికుల వాహన అమ్మకాలు 6 శాతం క్షీణించి 2,75,766 యూనిట్లకు పరిమితంకావడం గమనార్హం! విదేశీ అంశాలు భారత్ దిగుమతులపై టారిఫ్‌లను 50 శాతానికి పెంచుతున్నట్లు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించడంతో ఎగుమతి సంబంధ రంగాలపై ప్రతికూల ప్రభావం కనిపించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఫార్మాపైనా వడ్డింపులు తప్పవన్న ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఔషధ రంగంతోపాటు.. లెదర్, కెమికల్స్, ఫుట్‌వేర్, ఆక్వా, ఐటీ, టెక్స్టైల్స్ ప్రభావితంకానున్నట్లు పేర్కొన్నారు. కాగా.. జూలై నెలకు చైనా, యూఎస్ ద్రవ్యోల్బణం తదితర గణాంకాలు ఈ వారం విడుదలకానున్నాయి. ఈ అంశాలన్నీ మార్కెట్లో సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, స్వస్తికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలియజేశారు. టారిఫ్‌లపై స్పష్టత వచ్చేవరకూ మార్కెట్లు కన్సాలిడేట్ కావచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. గత వారమిలా.. గతవారం(4–8) దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో వారంలోనూ నష్టాలతోనే ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 742 పాయింట్లు(0.9 శాతం) క్షీణించి 79,858 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 202 పాయింట్లు(0.8 శాతం) నీరసించి 24,363 వద్ద ముగిసింది. ఈ బాటలో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.3 శాతం, స్మాల్ క్యాప్ 1.9 శాతం చొప్పున బలహీనపడ్డాయి.ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలుకొద్ది రోజులుగా పెట్టుబడులు వెనక్కి ఇటీవల కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలు చేపడుతున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ దాదాపు రూ. 18,000 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇక గత నెల(జూలై)లోనూ నికరంగా అమ్మకాలకే కట్టుబడ్డారు. దీంతో జూలైలో రూ. 17,741 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు మూడు నెలల్లో(ఏప్రిల్ నుంచి జూన్) నికర కొనుగోలుదారులుగా నిలిచారు. వెరసి రూ. 38,673 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. కాగా.. ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ నికరంగా చూస్తే ఎఫ్‌పీఐలు రూ. 1.13 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! యూఎస్ టారిఫ్ ప్రకటనలు, క్యూ1 ఫలితాల నిరుత్సాహం తదితర అంశాల కారణంగా ఎఫ్‌పీఐలు ఇటీవల తిరిగి అమ్మకాల బాటలో సాగుతున్నట్లు ఏంజెల్ వన్ సీనియర్ ఫండమెంటల్ విశ్లేషకులు వకార్జావేద్ ఖాన్, మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. సాంకేతికంగా.. ఎఫ్‌పీఐల అమ్మకాలు, యూఎస్ టారిఫ్‌ల వడ్డింపు నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు క్షీణపథంలో కదులుతున్నాయి. ఇదే బాటలో ఈవారం సైతం మరింత నీరసించే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. సాంకేతికంగా చూస్తే ఎన్ఎస్ఈ నిఫ్టీ వెనకడుగు వేస్తే తొలుత 24,200 పాయింట్ల వద్ద, తదుపరి 24,000 వద్ద మద్దతు లభించవచ్చని అంచనా వేశారు. ఒకవేళ బలపడితే 24,500 పాయింట్లవద్ద, 24,600 వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చని అభిప్రాయపడ్డారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఆర్బీఐ వైపు మార్కెట్ చూపు
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ పరపతి నిర్ణయాలవైపు దృష్టి సారించనున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే జోరందుకున్న ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నాయి. వీటికితోడు అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక గణాంకాలు సైతం కీలకంకానున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత వారాంతాన ఫెడరల్ బ్యాంక్, ఏబీబీ ఇండియా, జేకే లక్ష్మీ సిమెంట్ తదితరాలు ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించాయి. వీటికితోడు మరిన్ని దిగ్గజాలు ఈ వారం ఏప్రిల్–జూన్(క్యూ1) పనితీరును వెల్లడించనున్నాయి. ఈ జాబితాలో బాష్, శ్రీసిమెంట్స్, మారికో, ఏబీ క్యాపిటల్, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, బజాజ్ ఆటో, ట్రెంట్, పిడిలైట్ ఇండస్ట్రీస్, పీఎఫ్సీ, హీరో మోటోకార్ప్, బీహెచ్ఈఎల్, ఎల్ఐసీ, టైటన్ కంపెనీ, హెచ్‌పీసీఎల్, స్టేట్‌బ్యాంక్, టాటా మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ తదితరాలున్నాయి. నేడు(సోమవారం) ఫెడరల్ బ్యాంక్, ఏబీబీ, జేకే లక్ష్మీ సిమెంట్ కౌంటర్లలో యాక్టివిటీ కనిపించనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. గత పాలసీలో స్పీడ్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) గత సమీక్షలో అనూహ్యంగా కీలక వడ్డీ రేటు రెపోలో 0.5 శాతం కోత పెట్టింది. దీంతో మే నెలలో రెపో రేటు 5.5 శాతానికి దిగివచి్చంది. ఆర్థికవేత్తలు 0.25 శాతం తగ్గింపు అంచనా వేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే రెపో రేటు 1 శాతం తగ్గింది. ఫలితంగా 2022 ఆగస్ట్ తదుపరి వడ్డీ రేట్లు కనిష్టానికి చేరాయి. నేడు ప్రారంభంకానున్న ఆర్బీఐ పాలసీ సమీక్షా సమావేశాలు బుధవారం(6న) ముగియనున్నాయి. యూఎస్ టారిఫ్‌ల విధింపు, 3 శాతానికంటే దిగువకు చేరిన ద్రవ్యోల్బణం, ఈ ఏడాది ద్వితీయార్థంలో జీడీపీ నెమ్మదించవచ్చన్న అంచనాలు మరో 0.25 శాతం రేట్ల కోతకు వీలున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే గత రేట్ల కోత, ఈ ఏడాది తొలి 3 నెలల్లో జీడీపీ 7.4 శాతం వృద్ధి అంచనాల నేపథ్యంలో యథాతథ రేట్ల అమలుకే కట్టుబడవచ్చని మరికొంతమంది నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో ఇన్వెస్టర్లు పాలసీ నిర్ణయాలపై దృష్టి పెట్టనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేష్ గౌర్ తెలియజేశారు. విదేశీ గణాంకాలు జులై నెలకు చైనా సరీ్వసుల రంగ గణాంకాలు మంగళవారం(5న) వెలువడనున్నాయి. గురువారం(7న) వాణిజ్య గణాంకాలు వెల్లడికానున్నాయి. జూన్‌లోనే చైనా వాణిజ్య మిగులు దాదాపు 115 బిలియన్ డాలర్లకు చేరింది. అంతక్రితం 99 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కాగా.. జులై నెలకు యూఎస్ తయారీ, సరీ్వసుల రంగ గణాంకాలు సైతం సోమ, మంగళవారాల్లో వెలువడనున్నాయి. ఇక ఈ వారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(బీవోఈ) వడ్డీ రేట్ల సమీక్షను చేపట్టనుంది. ఇతర అంశాలు.. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా భారత్‌పై 25 శాతం టారిఫ్‌లను విధించడంతో 48 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. ప్రధానంగా టెక్స్టైల్స్, ఫార్మా, రత్నాభరణాలు, ఆక్వా, ఫుట్‌వేర్, కెమికల్స్ తదితర పలు రంగాలకు సవాళ్లు ఎదురుకానున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇవి మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా, జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ తెలియజేశారు. మరోపక్క గత నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే అధిక ప్రాధాన్యమిస్తూ వచి్చనట్లు వివరించారు. జూలైలో నికరంగా రూ.17,741 కోట్ల విలువైన షేర్లను నికరరంగా విక్రయించారు.గత వారం డీలా.. శుక్రవారం(ఆగస్ట్ 1)తో ముగిసిన గత వారం స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో వారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్(బీఎస్ఈ) 863 పాయింట్లు(1.1 శాతం) క్షీణించి 80,560 వద్ద నిలిచింది. నిఫ్టీ(ఎన్ఎస్ఈ) 272 పాయింట్లు(1.1 శాతం) నీరసించి 24,565 వద్ద స్థిరపడింది. ఈ బాటలో బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.8 శాతం, స్మాల్ క్యాప్ 2.5 శాతం చొప్పున పతనమయ్యాయి. సాంకేతికంగా చూస్తే.. యూఎస్ టారిఫ్‌ల విధింపు, ఎఫ్‌పీఐల అమ్మకాలకుతోడు గత వారాంతాన ప్రపంచ మార్కెట్లు డీలా పడటంతో దేశీయంగా సెంటిమెంటు బలహీనపడినట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు మరింత బలహీనపడవచ్చని అభిప్రాయపడ్డారు. వీటి ప్రకారం సాంకేతికంగా ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 24,900 స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. ఒక దశలో 24,550 దిగువకు చేరింది. దీంతో ఈ వారం 24,450 వద్ద తొలి మద్దతు లభించవచ్చు. ఇక్కడినుంచి పుంజుకుంటే 24,900–25,000కు తిరిగి చేరవచ్చు. ఇలాకాకుండా మరింత నీరసిస్తే 24,300కు, ఆపై 24,000 పాయింట్లస్థాయికి క్షీణించే వీలుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఆఖర్లో లాభాల స్వీకరణ
ముంబై: ఆఖర్లో అమ్మకాలు తలెత్తడంతో బుధవారం స్టాక్ సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఆగస్టు నెలవారీ ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ ముగింపు, దేశీయ క్యూ1 జీడీపీ వృద్ధి డేటాతో సహా కీలక స్థూల ఆర్థిక గణాంకాల విడుదల(నేడు)కు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆయిల్‌అండ్‌గ్యాస్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా ట్రేడింగ్‌లో 406 పాయింట్లు బలపడిన సెన్సెక్స్ చివరికి 11 పాయింట్ల లాభంతో 65,087 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 110 పాయింట్లు పెరిగిన నిఫ్టీ అయిదు పాయింట్ల లాభంతో 19,347 వద్ద స్థిరపడింది. మెటల్, ఐటీ, రియలీ్ట, ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లు రాణించాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్(జేఎఫ్ఎస్) షేరు వరుసగా మూడో రోజూ అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఇటీవల ఆర్ఐఎల్ ఏజీఎం సమావేశంలో జేఎఫ్ఎస్ బీమా, మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారాల్లోకి విస్తరిస్తుందని కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ చేసిన ప్రకటన ఈ షేరు ర్యాలీకి దోహదపడుతున్నాయి. తాజాగా బుధవారం బీఎస్ఈలో 5% ఎగసి రూ.233 వద్ద అప్పర్ సర్క్యూట్ వద్ద లాౖకైంది. ► గోకుల్ దాస్ ఎక్స్‌పోర్ట్స్ షేరు ర్యాలీ రెండో రోజూ కొనసాగింది. బీఎస్ఈలో 19% ఎగసి రూ.874 వద్ద స్థిరపడింది. యూఈఏకి చెందిన దుస్తుల తయారీ కంపెనీ అట్రాకోను 55 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.455 కోట్లు)కు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం ఈ షేరు ర్యాలీకి కారణమవుతోంది. -
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 106 పాయింట్లు లాభపడి 28,046.66 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 8,389.90 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, మెటల్, ఆటో, ఆయిల్, గ్యాస్ కంపెనీల షేర్లు లాభపడ్డాయి. -
నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్, నిఫ్టీ!
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు గురువారం ట్రేడింగ్ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 33 పాయింట్ల నష్టంతో 27975 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 8362 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఆర్ధిక గణాంకాల్లో సానుకూల ప్రభావం, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఆటో, విద్యుత్, కాపిటల్ గూడ్స్ కంపెనీల షేర్లు లాభపడటంతో.. ఆరంభంలో సెన్సెక్స్ 89 పాయింట్ల లాభంతో 28098 పాయింట్లను తాకింది. సిప్లా, సన్ ఫార్మా, బీహెచ్ఈఎల్, టాటా స్టీల్, లార్సెన్ లాభపడగా, బీపీసీఎల్, ఎన్ ఎమ్ డీసీ, కెయిర్న్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, ఐడీఎఫ్ సీ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.