SBI ఖాతాదారులకు షాక్.. పెరిగిన లోన్ వడ్డీ రేట్లు! | SBI Raises MCLR From Today Check The Latest Lending Rates Across Tenures | Sakshi
Sakshi News home page

SBI ఖాతాదారులకు షాక్.. పెరిగిన లోన్ వడ్డీ రేట్లు!

Oct 15 2026 2:37 PM | Updated on Oct 15 2026 2:56 PM

SBI Raises MCLR From Today Check The Latest Lending Rates Across Tenures

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. కొన్ని రకాల లోన్స్ మీద వడ్డీ రేట్లను పెంచింది. ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్ వంటి వాటితో పాటు.. కొన్ని కాలపరిమితులకు సంబంధించిన ఎంసీఎల్ఆర్ రేట్లను సవరించింది. ఈ కొత్త రేట్లు అక్టోబర్ 15, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఎస్‌బీఐలో హోమ్ లోన్లు, ఇతర రుణాలు తీసుకున్నవారిపై ఈఎంఐ భారం పెరిగే అవకాశం ఉంది.

ఎస్‌బీఐ ప్రకారం.. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.25 శాతం నుంచి 8.40 శాతానికి పెరిగింది. ఆరు నెలల రేటు 8.60 శాతం నుంచి 8.75 శాతానికి చేరింది. ఏడాది కాలపరిమితి రేటు 8.70 శాతం నుంచి 8.85 శాతానికి పెరిగింది. అలాగే.. రెండేళ్ల రేటు 8.75 శాతం నుంచి 8.90 శాతానికి, మూడేళ్ల రేటు 8.80 శాతం నుంచి 8.95 శాతానికి చేరింది. అయితే.. ఓవర్‌నైట్, ఒక నెల కాలపరిమితి రేట్లలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇవి యథాతథంగా 7.85 శాతం వద్ద కొనసాగుతున్నాయి.

ఈ వడ్డీ రేట్ల పెంపుతో ముఖ్యంగా ఎంసీఎల్ఆర్ ఆధారంగా లోన్స్ తీసుకున్నవారిపై ప్రభావం పడవచ్చు. ఉదాహరణకు, హోమ్ లోన్ వడ్డీ రేటు పెరిగితే నెలవారీ ఈఎంఐ పెరిగే అవకాశం ఉంటుంది. లేదంటే లోన్ పూర్తిగా చెల్లించడానికి పట్టే సమయం పెరిగే అవకాశం ఉంటుంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ప్రతి ఒక్కరికీ వెంటనే ఈఎంఐ పెరుగుతుందని చెప్పలేం. రుణ ఒప్పందం, వడ్డీ రేటు మార్పు అమల్లోకి వచ్చే తేదీపై ఇది ఆధారపడి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: నేనింకా దొంగనేనా?.. విజయ్ మాల్యా సంచలన ట్వీట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement