8.49 లక్షల మందికి కొత్తగా ఈపీఎఫ్‌ | EPFO Adds 19 14 Lakh Net Members in April 2025 | Sakshi
Sakshi News home page

EPFO Update: 8.49 లక్షల మందికి కొత్తగా ఈపీఎఫ్‌

Jun 23 2025 4:12 PM | Updated on Jun 23 2025 5:25 PM

EPFO Adds 19 14 Lakh Net Members in April 2025

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ పరిధిలోకి ఏప్రిల్‌ నెలలో 19.14 లక్షల మంది చేరారు. ఈ ఏడాది మార్చి నెలలో చేరికతో పోల్చితే 31 శాతం, 2024 ఏప్రిల్‌ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 1 శాతం వృద్ధి నమోదైంది. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది.

ఏప్రిల్‌లో కొత్త సభ్యుల చేరిక 8.49 లక్షలుగా ఉంది. మార్చి నెలలో కొత్త సభ్యుల చేరిక కంటే 12.49 శాతం ఎక్కువ. అంటే వీరు మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. ఇందులో మహిళా సభ్యులు 2.45 లక్షల మంది ఉన్నారు. మార్చి నెలతో పోల్చి చూస్తే 17.63 శాతం పెరిగారు. కొత్త సభ్యుల్లో 57 శాతం మేర అంటే, 4.89 లక్షల మంది వయసు 18–25 ఏళ్ల మధ్య ఉంది.

మహిళా సభ్యుల నికర చేరిక మాత్రం మార్చి నెలతో పోల్చి చూస్తే 35 శాతం అధికంగా 3.95 లక్షలుగా ఉంది. ఏప్రిల్‌లో సుమారుగా 15.77 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో ఉద్యోగం మానేసి, మరో సంస్థలో చేరారు. మార్చి నెలతో పోల్చి చూస్తే 19 శాతం పెరిగింది. నికర చేరికలో అత్యధికంగా 21 శాతం సభ్యులు మహారాష్ట్ర నుంచి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement