ఎంబసీ రీట్స్‌కు రూ.889 కోట్ల ఆదాయం | Embassy Office Parks REIT revenue grows to Rs 889 crore | Sakshi
Sakshi News home page

ఎంబసీ రీట్స్‌కు రూ.889 కోట్ల ఆదాయం

Oct 27 2023 4:30 AM | Updated on Oct 27 2023 4:30 AM

Embassy Office Parks REIT revenue grows to Rs 889 crore - Sakshi

న్యూఢిల్లీ: ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ రీట్‌ సెపె్టంబర్‌ క్వార్టర్‌కు 4 శాతం అధికంగా రూ.889 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.857 కోట్లుగా ఉంది. సెప్టెంబర్‌ త్రైమాసికానికి రూ.524 కోట్లను వాటాదారులకు పంపిణీ చేయాలని (ఒక్కో యూనిట్‌కు రూ.5.53 చొప్పున) ఎంబసీ రీట్‌ నిర్ణయించింది.

రికార్డు స్థాయిలో 2 మిలియన్‌ చదరపు అడుగుల లీజును నమోదు చేసినట్టు ఎంబసీ రీట్‌ సీఈవో అరవింద్‌ మాయా తెలిపారు. ‘‘2023–24 మొదటి ఆరు నెలల్లో 3.1 మిలియన్‌ చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు ఇచ్చాం. పూర్తి ఆర్థిక సంవత్సరానికి పనితీరు పరంగా ఆశావహంగా ఉన్నాం’’అని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6 మిలియన్‌ చదరపు అడుగుల లీజ్‌ ఉంటుందన్న గత అంచనాలను, 6.5 మిలియన్‌ చదరపు అడుగులకు పెంచినట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement