ఆడియో, వీడియో కాల్ సదుపాయం ఎక్స్(ట్విటర్)లో కూడా - ఎలాన్ మస్క్ | Elon Musk Announced That X Will Get Audio And Video Calls Feature Very Soon, No Phone Number Required - Sakshi
Sakshi News home page

Audio And Video Calls Feature In X: త్వరలో ఎక్స్(ట్విటర్)లో ఆడియో, వీడియో కాల్ సదుపాయం - ఎలాన్ మస్క్

Published Thu, Aug 31 2023 1:31 PM

Elon Musk announces audio and video calls on X details - Sakshi

ఎలాన్ మస్క్ ట్విటర్ కంపెనీ కొనుగోలు చేసిన తరువాత అనేక మార్పులు చేసిన విషయం తెలిసింది. ఉద్యోగుల తొలగింపు, బ్రాండ్ లోగోలో మార్పు వంటి వాటితో పాటు, ఇటీవల ట్విటర్‌కి 'ఎక్స్' అని నామకరణం చేసాడు. కాగా ఇప్పుడు ఆడియో అండ్ వీడియో కాల్స్‌కి సంబంధించిన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇటీవల 'ఎక్స్'గా పేరు మార్చుకున్న ట్విటర్‌లో త్వరలో ఆడియో అండ్ వీడియో కాల్స్ సదుపాయం లభిస్తుందని కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ వెల్లడించారు. దీనిని వినియోగదారులు ఫోన్ అవసరం లేకుండా వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్, మాక్, పీసీలో వినియోగించుకోవచ్చు. అయితే ఇది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనేది తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: 64 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్.. కారణం ఏంటంటే?

Advertisement
 

తప్పక చదవండి

Advertisement