డాక్టర్‌ రెడ్డీస్‌ చేతికి మెనో ల్యాబ్స్‌ | Dr Reddy's Acquire Menolabs | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ రెడ్డీస్‌ చేతికి మెనో ల్యాబ్స్‌

Jan 4 2024 7:39 AM | Updated on Jan 4 2024 7:41 AM

Dr Reddy's Acquire Menolabs - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ తాజాగా అమెరికాకు చెందిన మహిళల ఆరోగ్య సంరక్షణ, సప్లిమెంట్స్‌ ఉత్పత్తుల సంస్థ మెనోల్యాబ్స్‌ను కొనుగోలు చేసింది. అమెరికన్‌ బయోటెక్నాలజీ కంపెనీ అమిరిస్‌లో భాగమైన మెనోల్యాబ్స్‌ను దివాలా కోడ్‌ ద్వారా దక్కించుకున్నట్లు పేర్కొంది.

మెనోల్యాబ్స్‌ పోర్ట్‌ఫోలియోలో ఏడు బ్రాండెడ్‌ ఉత్పత్తులు, యాప్‌ మొదలైనవి ఉన్నట్లు వివరించింది. మహిళల పౌష్టికాహార, వెల్‌నెస్‌ ఉత్పత్తుల మార్కెట్లో తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు మెనోల్యాబ్స్‌ కొనుగోలు ఉపయోగపడగలదని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఉత్తర అమెరికా విభాగం సీఈవో మార్క్‌ కికుచి తెలిపారు.

మెనోల్యాబ్స్‌ అమెరికాలో తమ సొంత ఈ–కామర్స్‌ మార్కెట్‌ప్లేస్‌తో పాటు అమెజాన్, వాల్‌మార్ట్‌ ద్వారా కూడా ఉత్పత్తులను విక్రయిస్తోంది.    

Advertisement
 
Advertisement
Advertisement