దెబ్బ మీద దెబ్బ : అమ్మకానికి డిస్నీ.. కొనుగోలు రేసులో ఎవరెవరున్నారంటే? | Sakshi
Sakshi News home page

దెబ్బ మీద దెబ్బ : అమ్మకానికి డిస్నీ.. కొనుగోలు రేసులో ఎవరెవరున్నారంటే?

Published Fri, Oct 6 2023 10:02 PM

Disney Talks With Adani, Maran To Sell India Assets - Sakshi

అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా దిగ్గజం ది వాల్ట్‌ డిస్నీ కంపెనీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో వాల్ట్‌ డిస్నీకి సంబంధించిన ఆస్తుల్ని అమ్మేందుకు సిద్ధమైనట్లు పలునివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ఇందులో భాగంగా బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ, మీడియా మొఘల్‌, సన్‌ నెట్‌ గ్రూప్‌ అధినేత కళా నిధి మారన్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇందులో భాగంగా భారత్‌లో నిర్వహించే కార్యకలాపాలలో కొంత భాగాన్ని విక్రయించడం లేదా, స్పోర్ట్స్‌ రైట్స్‌, లోకల్‌ స్ట్రీమింగ్ సర్వీస్ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌తో సహా ఇతర ఆస్తుల్ని కలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తేలింది.  

ముఖేష్‌ అంబానీతో చర్చలు
ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ సైతం ఆస్తుల అమ్మే అంశంపై చర్చలు ఇప్పటికే జరిగాయని బ్లూమ్‌బెర్గ్ గతంలో నివేదించింది. తద్వారా భారత్‌లో డిస్నీ తన వ్యాపారాన్ని అమ్మేడం లేదంటే జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేసేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

ఐపీఎల్‌ దెబ్బ.. ఆపై హెచ్‌బీఓ కాంట్రాక్ట్‌ సైతం
జూలైలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ స్ట్రీమింగ్ హక్కులను వయాకామ్ 18 మీడియా దక్కించుకున్న తరువాత ఆస్తుల అమ్మకం తెరపైకి వచ్చింది. దీనికితోడు వార్నర్‌ బ్రదర్స్‌కు చెందిన హెచ్‌బీఓ కాంట్రాక్టును సైతం రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18 దక్కించుకోవడం కూడా ప్రభావం చూపింది. అప్పటి నుంచి డిస్నీ హాట్‌స్టార్‌కు సబ్‌స్క్రైబర్లు తగ్గుతున్నారు. దీంతో ఆస్తుల్ని అమ్మేందుకు మొగ్గుచూపింది. 

అదానీ వర్సెస్‌ మారన్‌
ఆస్తులు,స్టాక్స్‌ను కొనుగోలు చేసేందుకు కళానిధి మారన్‌ సుమఖత వ్యక్తం చేస్తుండగా.. అదానీ సైతం తన మీడియా సంస్థ న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్‌ను (ఎన్‌డీటీవీ)ని విస్తరించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం, క్రయ,విక్రయ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటనలు వెలుగులోకి రాలేదు. త్వరలో దీనిపై స్పష్టత రానుంది. 

చదవండి👉 అప్పుడు ‘మెగాస్టారే’, ఇప్పుడు కరువైన పలకరింపులు.. జీవితం భారమై..

Advertisement
 

తప్పక చదవండి

Advertisement