ప్రస్తుతం మనమంతా డిజిటల్ యుగంలో జీవిస్తున్నాం. ఇప్పటికే దాదాపు చెల్లింపులన్నీ డిజిటల్గానే జరుగుతున్నాయి. డిజిటలైజేషన్ ఇప్పుడిప్పుడే ఒక్కొక్క పౌరసేవకు విస్తరిస్తోంది. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు సైతం డిజిటలైజేషన్‌ను అందిపుచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో వివాహ రిజిస్ట్రేషన్ డిజిటల్‌గా నిర్వహించడం ఇప్పుడు సరికొత్త అధ్యాయానికి తెర తీసింది.
ఏమిటీ డిజిటల్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్?
సాధారణంగా వివాహ రిజిస్ట్రేషన్ అంటే పెళ్లి జరిగిన తర్వాత వధూవరులతో పాటు ఇరువైపులా సాక్షుల సంతాలతో పలు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం రోజులకొద్దీ సమయం పడుతుంది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది.
ఈ తతంగాన్ని సరళీకరిస్తూ డాక్యుమెంట్ల అవసరం లేకుండా పెళ్లి వేదిక వద్ద నుంచే డిజిటల్ కేవైసీ వెరిఫికేషన్ ద్వారా చేసేదే డిజిటల్ వివాహ రిజిస్ట్రేషన్. పెళ్లి జరిగే స్థానిక మున్సిపాలిటీలు లేదా గ్రామ పంచాయతీలను సమన్వయం చేసుకుంటూ అధికారులు ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. డిజిటల్ సంతకం కూడిన మ్యారేజ్ సర్టిఫికెట్‌ను కూడా జారీ చేస్తారు.
కేరళలో శ్రీకారం
వివాహ రిజిస్ట్రేషన్ డిజిటల్‌గా నిర్వహించి వార్తల్లో నిలిచింది కేరళ. కవస్సేరీ గ్రామ పంచాయతీలో లావణ్య, విష్టు అనే వధూవరులు వీడియో డిజిటల్ కేవైసీ ద్వారా తమ వివాహాన్ని రిజిష్టర్ చేసుకున్నారు. అదే రోజున డిజిటల్ ధ్రువీకరణతో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అందుకున్నారు.
కేరళ ప్రభుత్వ అనేక పౌర సేవలను డిజిటల్ విధానంలో అందిస్తోంది. ఇందు కోసం ‘కె-స్మార్ట్ గవర్నెన్స్’ అనే ప్లాట్ఫామ్ను తీసుకొచ్చింది. ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగంగా, పారదర్శకంగా అందించడమే ఈ చొరవ లక్ష్యం.
జాతీయస్థాయిలోనూ ప్రయత్నాలు
పౌర సేవలను డిజిటలైజేషన్ చేసేందుకు జాతీయస్థాయిలోనూ విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక రాష్ట్రాలు డిజిటల్ చొరవతో ముందుకు వెళ్తున్నాయి. ఈ దిశగా మహారాష్ట్రలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రూ.62 కోట్ల నిధులు కేటాయించి భూములు, వివాహాల రికార్డులను డిజిటలైజ్ చేస్తోంది.
Kerala sets an example !!
In Kawassery, Kerala, Lavanya and Vishnu got married and registered their marriage instantly through Video KYC.
The Panchayat member even handed over a digitally verified certificate with their photo on the same day.
Respected Panchayati Raj Minister… pic.twitter.com/HGAnoU5cu0— Sreekanth B+ve (@sreekanth324) October 23, 2025


