ముంబై: అంతర్జాతీయ లాజిస్టిక్స్ కంపెనీ డీహెచ్‌ఎల్ గ్రూప్ భారత్‌లో 2030 నాటికి బిలియన్ యూరోలను (రూ.10,400 కోట్లు సుమారుగా) ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది. తద్వారా ఇక్కడి కస్టమర్లకు మరిత నమ్మకమైన రవాణా పరిష్కారాలను అందించనున్నట్టు పేర్కొంది. వ్యాపార వృద్ధికి భారత్‌ను కీలక మార్కెట్‌గా పరిగణిస్తున్నట్టు తెలిపింది.
అంతర్జాతీయ వాణిజ్యంలో సమస్యలు నెలకొన్నప్పటికీ, భారత మార్కెట్ పట్ల విశ్వాసంతో ఉన్నట్టు పేర్కొంది. ఇక్కడి వైవిధ్యమైన, వ్యాపార అనుకూల విధానాలను ప్రస్తావించింది. బిలియన్ యూరోలను లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, న్యూ ఎనర్జీ, ఈ–కామర్స్, డిజిటలైజేషన్‌పై వెచి్చంచనున్నట్టు పేర్కొంది.
బివాండిలో మొదటి హెల్త్ లాజిస్టిక్స్ హబ్, బిజ్వాసన్‌లో బ్లూడార్ట్ కోసం సమగ్ర నిర్వహణ కేంద్రం (తక్కువ ఉద్గారాలతో కూడిన), ఢిల్లీలో డీహెచ్‌ఎల్ ఎక్స్‌ప్రెస్ కోసం మొదటి ఆటోమేటిక్ సారి్టంగ్ కేంద్రం, ఇండోర్‌లో ఐటీ సేవల కేంద్రం (కంపెనీకి భారత్‌లో ఐదవది), చెన్నై, ముంబైలో ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ బ్యాటరీ లాజిస్టిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు డీహెచ్‌ఎల్ గ్రూప్ వెల్లడించింది.


