24 ఏళ్లకే ఉద్యోగం.. 29 ఏళ్లకే రిటైర్మెంట్‌.. గూగుల్‌ ఉద్యోగి స్ట్రాటజీ అదిరింది! | Sakshi
Sakshi News home page

24 ఏళ్లకే ఉద్యోగం.. 29 ఏళ్లకే రిటైర్మెంట్‌.. గూగుల్‌ ఉద్యోగి స్ట్రాటజీ అదిరింది!

Published Fri, Jan 19 2024 6:42 PM

iit Bombay Graduate Is Ready To Retire At Just 29 After Working At Google  - Sakshi

24 ఏళ్లకే ఉద్యోగం..29 ఏళ్లకే రిటైర్మెంట్‌. ఆహా! జీవితం అంటే ఇది’ అని అనుకుంటున్నారా? ఐఐటీ బాంబే పూర్వ విద్యార్ధి డేనియల్‌ జార్జ్‌ (29) ఇలాగే అనుకున్నాడు. 6 ఏళ్ల పాటు ఉ‍ద్యోగం చేసి చివరికి రిటైర్మెంట్‌ తీసుకున్నాడు. 

డేనియల్ జార్జ్ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) నిపుణుడు.  2018లో జార్జ్ ఐఐటి బాంబే నుండి బిటెక్ పూర్తి చేశాడు. 24 ఏళ్ల వయస్సు అమెరికాలోని గూగుల్‌ ప్రధాన కార్యాలయంలో ఏడాదికి 265,000 డాలర్ల (సుమారు రూ. 2.20 కోట్లు) ప్యాకేజీతో జాబ్‌ సంపాదించాడు.

 
అంత డబ్బు ఎలా ఆదా చేశాడు
అతను గూగుల్‌లో పనిచేసే సమయంలో సంపాదించిన డబ్బును ఆదా చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో లెక్కలేసుకుని తన శాలరీని ఎంత మొత్తంలో ఆదా చేసే త్వరగా రిటైర్‌ అవ్వచ్చు? అనంతరం తన సొంత దేశమైన భారత్‌లో ఎలా నివసించవచ్చో గుర్తించాడు. అంతే అప్పటి నుంచి రిటైర్మెంట్‌ కోసం శాలరీని సేవ్‌ చేయడం మొదలు పెట్టాడు.

గూగుల్‌లో పనిచేయడం ఓ కల
గూగుల్‌లో పనిచేయడం ఒక కల. అదో ‘మాయా అద్భుత భూభాగం’లాంటిదని అభివర్ణిస్తూ డబ్బుల్ని ఎలా సేవ్‌ చేశాడో చెప్పుకొచ్చాడు. ముందుగా గూగుల్‌లో అపరిమిత ఆహారం, పానీయాలు, పింగ్ పాంగ్ టేబుల్స్‌ , వీడియో గేమ్ రూమ్‌లు, సాకర్ ఫీల్డ్‌లు, జిమ్, టెన్నిస్ కోర్ట్‌లు, ఫ్రీ మసాజ్ వంటి మరిన్ని సౌకర్యాలను అందించింది. వాటిని వినియోగించుకున్నాడు. కానీ అప్పుడే జార్జ్‌ గూగుల్‌లో తాను సంపాదించే జీతంలో సగానికిపైగా మొత్తాన్ని ట్యాక్స్‌ చెల్లిస్తున్నట్లు గుర్తించాడు.

 

ట్యాక్స్‌ తగ్గించుకునేందుకు
అప్పటి నుంచి జార్జ్ తన ట్యాక్స్‌ను తగ్గించుకోవడానికి రిటైర్మెంట్‌ అకౌంట్‌లో ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. ఆఫీస్‌కి నడిచి వెళ్లడం, గూగుల్‌లో పని చేసే సమయంలో మూడుపూటలా అక్కడే భోజనం చేయడంతో డబ్బు ఆదా అయ్యేది. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఆహారాన్ని ఖర్చు చేసినట్లు చెప్పాడు. సాధారణంగా సిలికాన్ వ్యాలీలో ఇంటి రెంట్‌ చాలా ఖరీదైన వ్యవహారంతో కూడుకుంది. అయినప్పటికీ, తన స్నేహితులతో కలిసి అపార్ట్‌మెంట్‌ని షేర్‌ చేసుకోవడం వల్ల అద్దె తగ్గిందని అన్నాడు.  


ట్యాక్స్‌ చెల్లింపులు ఎంతంటే?
జార్జ్ ప్రతి సంవత్సరం పన్ను ఆదా చేసుకునేందుకు రూ.62లక్షలు పెట్టుబడి పెడుతూ వచ్చాడు. రిటైర్మెంట్‌ అయ్యేందుకు కావాల్సినంత మొత్తాన్ని సమకూర్చుకున్నాడు. గత ఏడాది జార్జ్ 29 ఏళ్ళ వయసులో థర్డ్ ఇయర్ ఏఐ అనే స్టార్టప్‌ను ప్రారంభించాడు. “ఇప్పుడు నేను జీతం సంపాదించడం గురించి ఎప్పుడూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నేను నా కంపెనీని ప్రారంభించడం కోసం రిస్క్ చేయగలను. నా భార్య పిల్లల కోసం కావాల్సినంత సంపాదించాను. అందుకే త్వరగా రిటైర్మెంట్‌ తీసుకుంటున్నాను అంటూ ఆర్ధిక పాఠాలు చెబుతున్నాడు. 

Advertisement
 
Advertisement