ఆనంద్‌ మహీంద్ర గిప్ట్‌కు: ప్రజ్ఞానంద రియాక్షన్‌ ఇదీ! | Chess GrandMaster Praggnanandhaa Reacts As Anand Mahindra Gifts Expensive XUV400 Electric SUV - Sakshi
Sakshi News home page

ఆనంద్‌ మహీంద్ర గిప్ట్‌కు: ప్రజ్ఞానంద రియాక్షన్‌ ఇదీ!

Aug 30 2023 3:08 PM | Updated on Aug 30 2023 3:44 PM

ChessGrand Master Praggnanandhaa Reacts As Anand Mahindra gifts Expensive suv ev - Sakshi

RPraggnanandhaa Reacts Parents Long Term Dream పారిశ్రామికవేత్త, బిలియనీర్‌  తన తల్లి దండ్రులకు ప్రకటించిన బహుమతిపై భారత చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌, ఫైడ్‌ చెస్‌ ప్రపంచ కప్‌ రన్నర్ అప్‌ ఆర్‌ ప్రజ్ఞానంద  స్పందించారు.  ఒక ఎలక్ట్రిక్‌ కారుకోసం కల గన్న తన అమ్మా నాన్నల చిరకాల వాంఛను ("లాంగ్ టర్మ్ డ్రీమ్") తీర్చినందుకు ధన్యవాదాలు సార్‌ అంటూ ప్రజ్ఞానంద ట్వీట్‌ చేశారు. తన కృతజ్ఞతను తెలియజేయడానికి పదాలు లేవు...చాలా ధన్యవాదాలు అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రజ్ఞానంద సాధించిన ఘనతకు గౌరవంగా అతని తల్లిదండ్రులకు ఆల్-ఎలక్ట్రిక్ SUVని బహుమతిగా ఇవ్వాలని ఆనంద్ మహీంద్రా నిర్ణయించిన సంగతి తెలిసిందే. (ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే గిఫ్ట్‌)

కాగా పిల్లవాడి ఆసక్తిని గమనించి,  ప్రోత్సహించిన ప్రజ్ఞానంద పేరెంట్స్‌  నాగలక్ష్మి  రమేష్‌బాబులను ఆనంద్‌ మహీంద్ర అభినందించారు. ఇందులో భాగంగానే వారికి ఆల్ ఎలక్ట్రిక్ SUV XUV400ని  ఇవ్వనున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.  అంతేకాదు దేశంలో తల్లిదండ్రులు దీన్ని ప్రేరణగా తీసుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.  ఈ క్రమంలోనే మహీంద్ర ఆల్ ఎలక్ట్రిక్ SUV XUV400ని ప్రత్యేక ఎడిషస్‌ను ఆ దంపతులకు ఇవ్వనున్నామని మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో బదులిచ్చారు. దీంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement