ఆగస్టు చివరికి రూ.5,98,153 కోట్లు
కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్ట్ చివరికి రూ.5,98,153 కోట్లకు చేరింది. 2025–26 జీడీపీలో ద్రవ్యలోటు (ఆదాయం– వ్యయాల మధ్య అంతరం) 4.4 శాతం, అంటే రూ.15.69 లక్షల కోట్లుగా ఉంటుందన్నది ప్రభుత్వం అంచనా. తొలి ఐదు నెలల్లో ద్రవ్యలోటు మొత్తం అంచనాల్లో 38 శాతానికి చేరింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) ఈ వివరాలు విడుదల చేసింది.
ఆగస్ట్ చివరికి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన నికర ఆదాయం రూ.8.1 లక్షల కోట్లు. ఇందులో రూ.4.4 లక్షల కోట్లు పన్నేతర రూపంలో, రూ.31,970 కోట్లు రుణాల రూపంలో ఉన్నాయి. పన్నుల్లో వాటా కింద రాష్ట్రాలకు రూ.5.3 లక్షల కోట్లను కేంద్రం బదిలీ చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే రూ.74,431 కోట్లు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.18.8 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇందులో రూ.14.49 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయాలు కాగా, రూ.4.31 లక్షల కోట్లు మూలధన వ్యయాల కింద ఖర్చు అయింది. రెవెన్యూ వ్యయంలోనూ రూ.5,28,668 కోట్లు వడ్డీ చెల్లింపులకు పోగా, రూ.1,50,377 కోట్లు సబ్సిడీలకు వెచ్చించారు.
ఇదీ చదవండి: గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. ఎంతంటే..


