మార్చిన బేస్ ఇయర్‌తో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) డేటా సిరీస్‌ని విడుదల చేయనున్నట్లు కేంద్ర గణాంకాలు, పథకాల అమలు శాఖ వెల్లడించింది. అలాగే పారిశ్రామికోత్పత్తి కొత్త సిరీస్‌ను మే నెల నుంచి ప్రకటించనున్నట్లు ఒక ప్రకటనలో వివరించింది.
దీని ప్రకారం 2024 బేస్ ఇయర్‌గా (100కు సమానం) రిటైల్ ద్రవ్యోల్బణం కొత్త సిరీస్ 2026 ఫిబ్రవరి 12న విడుదల అవుతుంది. అలాగే, 2022–23 ఆర్థిక సంవత్సరం బేస్ ఇయర్‌గా నేషనల్ అకౌంట్స్ డేటాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న, ఐఐపీ డేటా మే 28న విడుదల చేస్తారు.


