స్వల్పకాలికం కావచ్చు, దీర్ఘకాలికం కావచ్చు.. మూలధన లాభాలను లెక్కించడమనేది చెప్పినంత సులువు కాదు. అలాగని, అంతుపట్టని బ్రహ్మ విద్య కూడా కాదు. వీటినెలా లెక్కించాలంటే..

ఇక్కడ వివరణ ఇవ్వాలి. భాషాపరంగా మెరుగుదల అంటే.. మెరుగు, తరుగు కాదు.
ఇంగ్లీషులో Improvements అంటే బాగా అర్థమవుతుంది. సరళంగా చెప్పాలంటే 2016లో ఇల్లు కట్టినప్పుడు నాలుగు గదులున్నాయి. 2021లో మరో రెండు గదులు వేశారు. 2016లో కొన్న విలువ (కొనుగోలు విలువ, కొన్న ధర)ను కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ (Cost of Acquisition) అంటారు. ఆ విలువకి 2021లో రెండు గదులకైన ఖర్చుని కలుపుతారు. 2021లో అయిన ఖర్చుని కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్స్ (Cost of Improvements) అని అంటారు.
దీర్ఘకాలిక మూలధన లాభాలను లెక్కించేటప్పుడు ఆయా ‘కాస్ట్’ని, కొన్న ధరని, ఇంప్రూవ్‌మెంట్స్ ధరని, ప్రస్తుత సంవత్సరం (ఏ సంవత్సరంలో అమ్ముతారో ఆ సంవత్సరంలో) సర్దుబాటు చేస్తారు. ద్రవ్యోల్బణంతో అనుసంధానించి సర్దుతారు. ద్రవ్యోల్బణం రేటు ప్రకారం అప్పట్లో కొన్న ధరను పెంచుతారు. ఇలా పెంచడాన్ని ఇండెక్సింగ్ అంటారు. దీనివల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
స్వల్పకాలిక మూలధన లెక్కింపులో ఇండెక్సింగ్ ఉండదు. దీర్ఘకాలిక ప్రయోజనాలకు మాత్రమే ఇండెక్సింగ్ ప్రయోజనాన్ని ఇస్తారు. ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయం మీద వివరణ ఇవ్వాలి.
ప్రతిఫలం అంటే..
ప్రతిఫలం అంటే, విక్రయించగా వచ్చినది. మీరు అమ్మిన ధర సేల్ డీడ్‌లో కనిపించే మొత్తం అని అనవచ్చు. మనం అమ్మే ధరను ఒప్పందం/డీడ్‌లో రాసుకుంటాం. దానికి ఇరు పక్షాలు ఒప్పుకుని సంతకాలు పెడతారు. సాక్షులు ఉంటారు. సాధారణ పరిస్థితుల్లో సేల్ డీడ్‌లో రాసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని మూలధన లాభాల లెక్కల అసెస్‌మెంట్ కావొచ్చు. కానీ, ప్రతిఫలం విషయంలో వచ్చినది, వచి్చనట్లు ఎవరూ చూపించడం లేదనే చెప్పాలి.
అగ్రిమెంటు విలువ వర్సెస్ అమ్మిన విలువ
అగ్రిమెంటులో ఒక కోటి రూపాయలు రాస్తున్నారు. తర్వాత అమ్మిన విలువను రూ. 70 లక్షలు లేదా అంతకన్నా తక్కువగా చూపిస్తున్నారు. ‘‘ఎందుకండి, కోటి రూపాయల మీద రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించడం. దండగ’’ ఇది కొనుగోలుదారు ఆవేదన, ఆక్రందన. ఇక అమ్మేవాళ్లూ ఏం తక్కువ కాదు. ఆ 30 లక్షల మీద పన్ను భారం (క్యాపిటల్ గెయిన్స్) కట్టడం అనవసరం అని 70 శాతాన్ని బ్యాంకులో చెక్ ద్వారా చూపిస్తూ, మిగతాది ‘బ్లాక్’గా నగదు రూపంలో తీసుకుంటున్నారు. ఇది చట్టరీత్యా తప్పు. నేరం. ఇలా తక్కువ చేయడం, ఒకప్పుడు, అంటే 2002 వరకు జరిగేది. అరకొర సిబ్బంది వల్ల, అరకొర సమాచారం వల్ల జరిగేది.
మరొక కారణం ఏమిటంటే, అప్పట్లో డిపార్టుమెంట్ల మధ్య సమాచారం ఇచి్చపుచ్చుకునే పద్ధతి, సమన్వయం అంతగా ఉండేది కాదు. రానురాను సమాచార మారి్పడి పద్ధతిని వ్యవస్థీకృతం చేశారు. ఆన్‌లైన్ వాడకం పెరిగింది. సమన్వయం పెరగడంతో పాటు కృత్రిమ మేధస్సును కూడా వాడుతున్నారు. సబ్–రిజి్రస్టార్ కార్యాలయం నుంచి రూ. 30,00,000 దాటిన క్రయవిక్రయాల వ్యవహారాలు ఎప్పటికప్పుడు డిపార్టుమెంట్లకు చేరిపోతున్నాయి. ఆ సేల్‌డీడ్‌లోని అన్ని విషయాలు ‘ఇంటిగ్రేట్’ అవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.


