కేంద్ర బడ్జెట్‌ 2026: బయో ఇం‘ధనం’ కావాలి.. | Budget 2026 Farmers and Industry Call for Biofuel Funding Tax Relief | Sakshi
Sakshi News home page

కేంద్ర బడ్జెట్‌ 2026: బయో ఇం‘ధనం’ కావాలి..

Jan 25 2026 10:11 AM | Updated on Jan 25 2026 12:10 PM

Budget 2026 Farmers and Industry Call for Biofuel Funding Tax Relief

పన్నులు తగ్గించాలని, బయో ఇంధనాలకు నిధుల మద్దతును వచ్చే బడ్జెట్‌లో (2026 –27) ప్రకటించాలంటూ వ్యవసాయం, అనుబంధ రంగాలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరాయి. ఆవిష్కరణలు, మౌలిక వసతులు, సంస్కరణల ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో భారత వ్యవసాయ రంగం పోటీపడే విధంగా, వృద్ధికి చోదకంగా తీర్చిదిద్దాలని సూచించారు.

బయో ఇంధనాలు, సస్టెయినబుల్‌ ఏవియేషన్‌ ఫ్యూయల్‌ (పెట్రోలియానికి ప్రత్యామ్నాయ ఇంధనం), గ్రీన్‌ హైడ్రెజన్‌కు రూ.2,500 కోట్లు కేటాయించాలని ఆల్‌ ఇండియా షుగర్‌ ట్రేడ్‌ అసోసియేషన్‌ (ఏఐఎస్‌టీఏ) డిమాండ్‌ చేసింది. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న చక్కెర మిల్లులు బయో ఇంధన కేంద్రాలుగా (ఇథనాల్‌ తయారీ ప్లాంట్ల ఏర్పాటు) అవతరించేందుకు మరో రూ.2,500 కోట్లు కేటాయించాలని కోరింది.

ఒక కిలో హైడ్రోజన్‌ కోసం 70 యూనిట్ల విద్యుత్‌ అవసరమని.. అదే హైడ్రోజన్‌ తయారీకి ఇథనాల్‌ వినియోగించినట్టయితే చక్కెర పరిశ్రమకు మేలు జరుగుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాలు, హైబ్రిడ్‌ వాహనాలపై జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించాలని, లీటర్‌ ఇథనాల్‌ కొనుగోలు ధరను రూ.6–8 పెంచాలని కోరింది. చక్కెర కిలో కనీస విక్రయ ధరను రూ.31 నుంచి పెంచాలని డిమాండ్‌ చేసింది.  

ఆర్గానిక్‌ సాగును ప్రోత్సహించాలి.. 
అవశేషాలు లేని, పోషకాలు పుష్కలంగా ఉండే సాగును ప్రోత్సహించాలని సొల్యుబుల్‌ ఫెర్టిలైజర్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు రాజిబ్‌ చక్రవర్తి కేంద్రాన్ని కోరారు. సబ్సిడీల్లేని సొల్యుబుల్, ఆర్గానిక్, మైక్రో న్యూట్రియంట్, స్టిమ్యులంట్‌ ఫెర్టిలైజర్‌ను కీలక పదార్థాలుగా గుర్తించాలని సూచించారు. పెరిగిపోయిన వాతావరణ మార్పులు, అధి క సాగు వ్యయాలు, కారి్మకుల వ్యయాలతో కాఫీ రంగం సంక్షోభం ఎదుర్కొంటున్నట్టు కేలచంద్ర కాఫీ ఎండీ రాణా జార్జ్‌ పేర్కొన్నారు. సాగు బీమాతోపాటు, దీర్ఘకాలానికి రుణ సాయం అందించాలని కోరారు. వాతావరణ మార్పులను తట్టుకోగల రకాలపై పరిశోధనలకు పెట్టుబడుల సాయం అందించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement