
న్యూఢిల్లీ: భారత్ సొంతంగా అభివృద్ధి చేసిన బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ నెట్‌వర్క్‌ని ఏడాదిలోగా 5జీకి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. భారత దేశం కూడా సొంతంగా 4జీ టెక్నాలజీ రంగంలోకి అడుగుపెట్టిందని ప్రపంచవ్యాప్తంగా స్వీడన్, ఫిన్లాండ్, దక్షిణ కొరియా, చైనాకు చెందిన హువావే, జడ్‌టీఈ, శాంసంగ్, నోకియా, ఎరిక్సన్ తదితర ఐదు కంపెనీలు 4జీ టెక్నాలజీలో ఆధిపత్యం వహిస్తున్నాయని, భారత్ కూడా ఇప్పుడు 4జీ ప్రపంచ క్లబ్‌లో ప్రవేశించిందన్నారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భరూచ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు 92564 టవర్లను ప్రారంభించినట్లు సింధియా తెలిపారు. ఈ వేగం ఇక్కడితో ఆగదని వచ్చే ఏడాదిలోగా ఈ 4జీ టవర్లను 5జీ నెట్‌వర్క్‌కు అప్‌గ్రేడ్ చేసి దేశమంతా 5జీ సేవలు అందిస్తామని సింథియా వెల్లడించారు.